Actress : 90’s యూత్ ఆరాధ్య దేవత.. టాలీవుడ్‌ను శాసించిన తోపు హీరోయిన్.. ఇన్నాళ్లకు నెట్టింట పోస్ట్..
తెలుగు సినిమా ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యారు. మరికొందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో అలరిస్తున్నారు. మరికొందరు విదేశాల్లో ఉంటూ బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం అటు సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉండిపోయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో చక్రం తిప్పిన తారలు చాలా మంది ఉన్నారు. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుని.. అగ్ర హీరోలతో జతకట్టిన తారలు చాలా మంది ఉన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వరుసి సినిమాలతో నటించి.. అప్పట్లో యూత్ ఫెవరేట్ కథానాయికగా కోట్లాది మంది అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకున్న తారల గురించి చెప్పక్కర్లేదు. అందులో హీరోయిన్ సంఘవి ఒకరు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత ఆమె వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. సంఘవి.. స్క్రీన్ మీద కనిపించి చాలా కాలమయ్యింది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ కు టైమ్ కేటాయిస్తుంది. కానీ ఒకప్పుడు ఆమె టాప్ హీరోయిన్. 1990లలో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
కర్ణాటకలోని మైసూరుకు చెందిన సంఘవి.. 1993లో తెలుగు చిత్రం ‘కొక్కరకో’ ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత అజిత్ నటించిన ‘అమరావతి’ చిత్రంతో తమిళ సినిమాలోకి అడుగుపెట్టింది. తెలుగులో జగపతి బాబు, శ్రీకాంత్, నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. దాదాపు 15 సంవత్సరాలు దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగింది. చివరగా 2005లో వచ్చిన ఆనై చిత్రంలో కనిపించింది. 2016లో సాఫ్ట్ వేర్ సంస్థ వెంకటేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఈ దంపతులకు ఒక పాప ఉంది. పెళ్లి తర్వాత బయట పెద్దగా కనిపించలేదు. సినిమా ఈవెంట్స్, పార్టీస్ అన్నింటికి దూరంగానే ఉండిపోయింది. కొన్నాళ్ల క్రితం తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సంఘవి.

Sanghavi Movies
ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న సంఘవి.. కొన్నా్ళ్ల క్రితం పలు టీవీ షోలలో పాల్గొంది. ఇదెలా ఉంటే.. న్యూ ఇయర్ సందర్భంగా సంఘవి పోస్ట్ చేసిన ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన కూతురు క్యూట్ లుక్స్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..




