రేపే పౌర్ణమి.. బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేస్తే అదృష్టం తలపు తట్టడం ఖాయం!

Samatha

2 January 2026

రేపే పుష్య పౌర్ణమి, పంచాంగం ప్రకారం పూర్ణిమ తిథి జనవరి 2 తేదీన సాయంత్రం ప్రారంభమై, జనవరి 3 తేదీన మధ్యాహ్నం వరకు ముగుస్తుంది.

రేపే పౌర్ణమి

ఉదయ తిథి ప్రకారం,  జనవరి 3వ తేదీన శని వారం రోజున పౌర్ణమిని జరుపుకొని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

తిథి ప్రకారం పౌర్ణమి

అయితే ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, కొన్ని నియమాలు పాటించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట, అలాగే ఇంటిలో సిరి సంపదలకు లోటు ఉండదంట.

బ్రహ్మ ముహుర్తం

పుష్య పౌర్ణమి రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నది స్నానం ఆచరించడం చాలా మంచిది. ఈ రోజున నది స్నానం చేయడం వలన గత జన్మ పాపాలు తొలిగిపోతాయి.

నది స్నానం

అలాగే ఈరోజు పసుపు రంగు పవ్వులతో లక్ష్మీదేవిని పూజించడం వలన మీ ఇంటిలో సంపదకు లోటు ఉండదంట. అంతే కాకుండా, అదృష్టం తలుపుతడుతుంది.

పసుపు రంగు పువ్వులు

అంతే కాకుండా పుష్య పౌర్ణమి రోజు ఎవరు అయితే శాకంబరీ దేవిని కూరగాయలతో అలంకరించి, పూజలు చేస్తారో, అలాగే సత్యనారాయణ వ్రతం ఆచరిస్తారో వారి ఇంట సుఖశాంతులు నెలకొంటాయి.

శాకంబరీ దేవి పూజ

పుష్య పౌర్ణమి రోజు అన్నదానం చేయడం , వస్త్రాలు వంటివి దానం చేయడం వలన కూడా అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

దాన, ధనర్మాలు చేయడం

అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో  ఇతరులకు డబ్బు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయకూడదంట. దీని వలన ఆర్థిక సమస్యలు తలెత్తుతాయంట.

ఆర్థిక లావాదేవీలు