Vastu Tips: ఇంట్లో ఆ శుభకార్యం జరగాలంటే ఈ పూల మొక్కను పెంచుకోండి.. ఫలితంగా..

ఇంటికి వాస్తు దోషం లేకుండా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పూలల్లో రాణిగా దీన్ని చెబుతారు. చూడటానికి దీని పూలు అందంగా ఉంటాయి. నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేలా చేస్తాయి.  దీని పూలు వాస్తు ప్రకారం మంచి ఫలితాలు ఇస్తాయనడంలో సందేహం లేదంటున్నారు.

Vastu Tips: ఇంట్లో ఆ శుభకార్యం జరగాలంటే ఈ పూల మొక్కను పెంచుకోండి.. ఫలితంగా..
Vastu Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 31, 2023 | 8:05 AM

మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన తమ్ముడు, చెల్లెలు ఉన్నారా..? ఎన్ని సంబంధాలు చూసినా ఎక్కడ పెళ్లి కుదరటం లేదా..? ఏళ్లు గడుస్తున్నప్పటికీ వివాహా సమయం రావటంలేదా..? అయితే, మన జ్యోతిష్యం, వాస్తు నియమాల్లో కొన్ని నివారణ మార్గాలు సూచించబడ్డాయి. అందులో భాగంగానే ఇంట్లో కొన్ని రకాల మొక్కలు నాటుకోవటం కూడా ఇంటికి మంచి చేస్తుంది. వివాహాది సంబంధాలకు సానుకూలత ఏర్పరుస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో చెట్లు, మొక్కలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. చెట్లు, మొక్కలు పర్యావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా అనేక గ్రహదోషాలను తొలగిస్తాయి. ఇంట్లో చెట్లు, మొక్కలు సానుకూలతను తెస్తాయి. జీవితంలోని అడ్డంకులను అధిగమిస్తాయి. వివాహా అడ్డంకులను కూడా తొలగిస్తారు. పెళ్లి చేసుకోవాలని తొందర పడుతున్న వాళ్లు, పెళ్లి కాలేదని కష్టాలు పడుతున్నవాళ్లు మన మధ్య చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఈ ఒక్క మొక్క నాటితే సరిపోతుంది. దాంతో ఖచ్చితంగా మీ పరిస్థితుల్లో మార్పును చూస్తారు.

జ్యోతిషశాస్త్రంలో ఈ మొక్క చాలా ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. నియమాల ప్రకారం ఈ మొక్కను ఇంట్లో నాటినట్లయితే, ఇది వివాహ సంబంధిత సమస్యలను తొలగించడమే కాకుండా..మీకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వాస్తు శాస్త్రంలో పియోని పువ్వులను చాలా అద్భుతంగా భావిస్తారు. ప్యూనీ మొక్కలో పెరిగే పువ్వును పువ్వుల రాణి అని పిలుస్తారు. ప్యూనీ పువ్వు అందం, శృంగార చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ మొక్క ఏమిటో తెలుసుకుందాం.

జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో పియోని మొక్కను దోషరహిత మొక్కగా పరిగణిస్తారు. ఇది చాలా ప్రజాదరణ పొందిన వాస్తు మొక్క. ఎందుకంటే ఇది విచ్ఛిన్నమైన సంబంధాలను చక్కదిద్దడంలో సహాయపడుతుంది. మన ఇంటి ఆవరణలో ప్యూనీ పూల మొక్కను నాటుకుంటే సరి. వాస్తు దోషం పటాపంచలైపోతుందని నమ్ముతున్నారు. ఈ మొక్కను నర్సరీలో కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే వస్తుంది.

ఇవి కూడా చదవండి

దీన్ని నైరుతి దిశలో నాటుకుంటే మంచిది. ఇంటికి వాస్తు దోషం లేకుండా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పూలల్లో రాణిగా దీన్ని చెబుతారు. చూడటానికి దీని పూలు అందంగా ఉంటాయి. నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేలా చేస్తాయి.  దీని పూలు వాస్తు ప్రకారం మంచి ఫలితాలు ఇస్తాయనడంలో సందేహం లేదు. ఎవరి ఇంటిలో పెళ్లి జరగక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు తమ ఇంటిలో ఈ మొక్కను నాటుకుని చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది.

వాస్తు ప్రకారం మీ ఇంటి నైరుతి మూలలో ప్యూనీ మొక్కను పెంచాలి. మీరు మీ ప్రియమైన వారికి ఈ పవిత్రమైన వాస్తు మొక్కను బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది వివాహా ఘడియలన్ని దగ్గర చేస్తుంది. ఇంట్లో చిన్న మొక్కను నాటడం వల్ల వివాహానికి అడ్డంకులు కలిగించే దోషాలు నశించి వివాహానికి కారణమైన శుక్రగ్రహం బలపడుతుంది.

పెళ్లైన అబ్బాయి,అమ్మాయి తమ చేతులతో ఇంట్లో ప్యూనీ మొక్కను నాటితే వివాహ బంధం నిలకడగా ఉండి వివాహం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. ప్యూనీ మొక్కను నాటడం సాధ్యం కాకపోతే, ఇంట్లోని డ్రాయింగ్ రూమ్‌లో పియోని ప్లాంట్, పియోని ఫ్లవర్ పెయింటింగ్ కూడా పెట్టుకోవచ్చు. పెళ్లయ్యాక, సమస్యలు తీరిన తర్వాత ఈ మొక్కను, పువ్వును ఇంట్లో పెట్టుకోవద్దు, మరొకరికి ఇవ్వండి. ప్యూనీ మొక్క ప్రభావంతో, వివాహం మాత్రమే కాదు, గృహ సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది.

ప్యూనీ మొక్క వాస్తు చిట్కాలు.. వివాదాలను తొలగించడానికి, ఇంటి దక్షిణ దిశలో ప్యూనీ మొక్కను నాటండి. సంతోషకరమైన జీవితం కోసం, నైరుతి మూలలో ప్యూనీ మొక్క, పెయింటింగ్ పెట్టుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం కుడివైపున ఉన్న తోటలో చిన్న మొక్కను నాటాలి.

మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?