AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యా బాబోయ్.. గజరాజు దెబ్బకు గడగడలాడిపోయిన టూరిస్టులు.. జస్ట్ మిస్.. లేకుంటే ఇక అంతే..

అడవిలో నడుస్తుంటే ఏ క్షణంలో వన్యప్రాణులు దాడిచేస్తాయో ఊహించలేం. పులులు, సింహాలు, చిరుతపులుల దాడిలో అనేక మంది మరణించిన ఉదంతాలు ఉన్నాయి.

Viral Video: అయ్యా బాబోయ్.. గజరాజు దెబ్బకు గడగడలాడిపోయిన టూరిస్టులు.. జస్ట్ మిస్.. లేకుంటే ఇక అంతే..
Jyothi Gadda
|

Updated on: Jan 30, 2023 | 1:41 PM

Share

దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళ్లే పర్యాటకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లిన ఘటనలు చాలాసార్లు చూశాం. పులులు, సింహాలు, చిరుతలు వంటి క్రూర జంతువులు మనుషులను వేటాడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. జంగిల్ సఫారీకి వెళ్లే సమయంలో జంతువుల దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ పర్యాటకులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు. అయితే కొందరు పర్యాటకులు మాత్రం నిబంధనలను అతిక్రమించి అడవిలో సంచరిస్తూ.. తమ ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. అలాంటిదే ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పర్యాటకులపై దాడి చేసేందుకు ఓ అడవి ఏనుగు వారిని జీపును వెంబడించింది. ఏనుగులను చూసి పర్యాటకులంతా భయంతో వణికిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించేది ఈ వీడియో..

ఈ థ్రిల్లింగ్ వీడియో ట్రావెల్జోమిన్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడింది. జంగిల్ సఫారీకి వెళ్లిన టూరిస్టులు జీపులో కూర్చుని అడవిలో వెళ్తున్నారు. ఒక్కసారిగా భారీ ఏనుగు వారిని వెంబడించింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆ గజరాజు.. పర్యాటకులపై దాడి చేయడానికి జీపు వెంబడి వేగంగా పరుగెత్తుతుంది. ఏనుగు తొండం చాచితే చాలు.. జీపు తుక్కుతుక్కుగా మారిపోయేంత దగ్గరగా ఉంది ఏనుగు. అంతలోనే అప్రమత్తమైన డ్రైవర్‌..జీపును అలాగే రివర్స్‌లో అంతే వేగంగా నడిపించాడు.. ఏనుగు జీపుకి అతి దగ్గరగా రాగానే, డ్రైవర్ ధైర్యం చేసి జీపుని మరింత వేగం పెంచాడు..ఇక పరిగెత్తలేక ఆ ఏనుగు వెనుదిరిగి వెళ్లిపోయింది. దీంతో పర్యాటకులు ఏనుగు దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Explore (@travelzomin)

అడవిలో నడుస్తుంటే ఏ క్షణంలో వన్యప్రాణులు దాడిచేస్తాయో ఊహించలేం. ఎందుకంటే వేట కోసం స్వేచ్ఛా-శ్రేణి జంతువులు, వారి ముందు మనిషి కనిపించగానే అవి దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి.. పులులు, సింహాలు, చిరుతపులుల దాడిలో అనేక మంది మరణించిన ఉదంతాలు ఉన్నాయి. అయితే కొంత మంది అడవిలో ప్రయాణించేటప్పుడు నిబంధనలు పాటించడం లేదు. ఇది వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. పర్యాటకుల భద్రత కోసం అటవీ శాఖ అధికారులు తరచూ విజ్ఞప్తి చేస్తుంటారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..