Pitbull attack: స్కూల్‌ విద్యార్థినిపై పిట్‌బుల్‌ దాడి.. చిన్నారి చెవి పట్టి ఈడ్చుకెళ్లి కుక్క..

ప్రభుత్వం ఇప్పటికే భయంకరమైన కుక్కల పెంపకంపై నిషేధం విధించింది.. రోట్‌వీలర్, పిట్‌బుల్, మస్తిమ్ వంటి ప్రమాదకర జాతుల కుక్కలను పెంచకూడదని ఆదేశాలు జారీ చేశారు. కానీ, ప్రభుత్వ ఆర్డర్ పక్కన పెట్టి కొందరు జంతుప్రేమికులు ఇలాంటి ప్రమాదకర కుక్కలను పెంచుకుంటున్నారు.

Pitbull attack: స్కూల్‌ విద్యార్థినిపై పిట్‌బుల్‌ దాడి.. చిన్నారి చెవి పట్టి ఈడ్చుకెళ్లి కుక్క..
Pitbull Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 31, 2023 | 7:08 AM

బిజ్నోర్‌లోని నూర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని షహీద్‌ నగర్‌లో నివాసం ఉంటున్న ధరంసింగ్‌ అనే వ్యక్తి కుమార్తె నవ్యపై జనవరి 24న కుక్క దాడి చేసింది. స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న చిన్నారిపై పిట్‌బుల్‌ దాడి చేసింది. చిన్నారి చెవి కొరికేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన అనంతరం బాలిక బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం ప్రకారం, పిట్‌బుల్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతోంది. ఈ క్రమంలోనే స్కూల్ ఆటో దిగి ఇంటికి వెళ్తున్న నవ్యపై ఒక్కసారిగా దాడి చేసింది. స్థానికులంతా ఎగబడి తరిమికొట్టడంతో పిట్‌బుల్‌ అక్కడ్నుంచి పారిపోయింది. బాలిక చెవి, శరీరంలో పలుచోట్ల బాలికను కొరికి తీవ్రంగా గాయపరిచింది.

ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం ఇప్పటికే భయంకరమైన కుక్కల పెంపకంపై నిషేధం విధించింది.. రోట్‌వీలర్, పిట్‌బుల్, మస్తిమ్ వంటి ప్రమాదకర జాతుల కుక్కలను పెంచకూడదని ఆదేశాలు జారీ చేశారు. కానీ, ప్రభుత్వ ఆర్డర్ పక్కన పెట్టి కొందరు జంతుప్రేమికులు ఇలాంటి ప్రమాదకర కుక్కలను పెంచుకుంటున్నారు. అయితే ఇటీవల బిజ్నోర్‌లోని పాఠశాల నుంచి తిరిగి వస్తున్న బాలికపై పిట్‌బుల్ కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. చికిత్స అనంతరం కొలుకున్న చిన్నారిని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాధిత బాలిక బంధువులు కుక్క యజమాని అమర్‌జిత్‌ భార్య, కుమారుడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్‌లో కుక్కకాటు ఘటనలు పెరుగుతున్నాయి. పెంపుడు కుక్కలు, ముఖ్యంగా ప్రమాదకరమైన జాతుల దాడిలో ఎక్కువ మంది ప్రజలు గాయపడుతున్నారు. పలు సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. యుపిలో దాదాపు 5000 మంది సైబీరియన్, హస్కీ, డాబర్‌మాన్, పిన్‌షర్, బాక్సర్ జాతి-724, పిట్‌బుల్, రోట్‌వీలర్ కుక్కలను పెంచుతున్నారు. ఇలాంటి కుక్కలు ఉన్నాయని తెలిసి కూడా మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పుడు వారినుంచి రిజిస్ట్రేషన్ ఫీజులను వసూలు చేస్తూ, చూసి చూడనట్టుగానే వదిలేస్తున్నారు. ఇప్పుడు ఎవరూ రిజిస్ట్రేషన్ లేకుండా ఈ కుక్కలను పెంచుకోలేరు. పట్టణ అభివృద్ధి పిట్‌బుల్స్, రోట్‌వీలర్స్, ఇంగ్లీష్ మాస్టిఫ్‌ల పెంపకాన్ని నిషేధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!