Budget 2023: నేటినుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న BRS, AAP..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలనను నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని BRS, AAP పార్టీలు నిర్ణయించాయి.

Budget 2023: నేటినుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న BRS, AAP..
Budget 2023
Follow us

|

Updated on: Jan 31, 2023 | 7:03 AM

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఇవ్వాల్టి నుంచి ప్రారంభకానున్నాయి. మంగళవారం ఉదయం రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రభుత్వం ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత రేపు (ఫిబ్రవరి 1న) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెన్‌ను ప్రవేశపెడతారు. ఈ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి విడత ఇవాళ్టి నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుంది. ఇక రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది. రెండో దశలో ఆర్థిక బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరగనుంది. చర్చల తర్వాత ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందుతుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్‌కి ఇది చివరి బడ్జెట్‌. బడ్జెట్‌ సమర్పణ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎడగట్టాలని బీఆర్ఎస్‌ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా గవర్నర్ల తీరుపై పార్లమెంట్ సమావేశాల్లో గళం విప్పాలని పార్టీ ఎంపీలను బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలపై ఎప్పటిలాగే రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రవర్తించిన తీరును సమావేశాల్లో ఎండగట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా, కాంగ్రెస్, పలు విపక్షపార్టీలు సైతం ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించాలని నిర్ణయించింది.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపర్చిన హామీలు, బాధ్యతలను కేంద్రం వెంటనే పూర్తి చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌ సమస్యలు పరిష్కారం, బకాయిలను వెంటనే విడుదల చేయాలని పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించనున్నారు. దాంతోపాటు ప్రతిజిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా, మొత్తం 12 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆర్థికసాయం చేయాలని అందజేయాలని కోరనున్నారు. వీటితోపాటు ఆర్థిక, సామాజిక స్థితిగతులతో కులగణన చేపట్టాలని, మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తనుంది వైసీపీ. మొత్తంమీదా పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుక్కున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..