AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaram Bapu: మరో అత్యాచారం కేసులో దోషిగా ఆశారాం బాపూ.. తేల్చిన గుజరాత్ కోర్టు.. పూర్తి వివరాలివే..

తనను తాను దేవుడినని చెప్పుకొనే ఆశారాం బాపూ.. తన ఆశ్రమంలో నివసిస్తున్న మహిళపై అత్యాచారం చేసినట్టు రుజువయిందని సోమవారం గాంధీనగర్‌లోని సెషన్స్‌ కోర్టు..

Asaram Bapu: మరో అత్యాచారం కేసులో దోషిగా ఆశారాం బాపూ.. తేల్చిన గుజరాత్ కోర్టు.. పూర్తి వివరాలివే..
Asaram Bapu Is Guilty In Another Rape Case
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 31, 2023 | 9:35 AM

Share

ఆయనో భారతీయ ఆధ్యాత్మిక గురువు. ఇప్పుటికే ఒక లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా మరో కేసులో ఆయనను కోర్టు దోషిగా నిర్దారించింది. అయితే ఆయనకు ఎంత కాలం శిక్ష పడుతుందనే విషయం నేడు(జనవరి 31) ఖరారు కానుంది. వివరాల్లోకి వెళ్తే.. తనను తాను దేవుడినని చెప్పుకొనే ఆశారాం బాపూ.. తన ఆశ్రమంలో నివసిస్తున్న మహిళపై అత్యాచారం చేసినట్టు రుజువయిందని సోమవారం(జనవరి 30) గాంధీనగర్‌లోని సెషన్స్‌ కోర్టు తెలిపింది.   16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయి ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూ మరో రేప్‌ కేసులో దోషిగా తేలారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం నాటి అత్యాచారం కేసులో గుజరాత్‌ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. 2013లో గుజరాత్‌ మోతేరాలో ఆశారాం ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులకు ఒక  మహిళ ఫిర్యాదు చేశారు.

దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా.. దీనిపై విచారణ జరిపిన గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు ఈ కేసులో ఆశారాంను దోషిగా తేల్చింది. సూరత్‌కు చెందిన ఒక మహిళ ఆశారాం బాపూతో పాటు మరో ఏడుగురిపై అత్యాచారం, అక్రమ నిర్బంధం కేసు పెట్టారు. వీరిలో ఒకరు విచారణ పెండింగ్‌లో ఉండగానే 2013 అక్టోబర్‌లో మృతిచెందగా.. 2014 జులైలో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆశారాం కుమారుడు నారాయణ్‌ సాయి, భార్య లక్ష్మి, కుమార్తె భారతి, నలుగురు మహిళా అనుచరులు ధ్రువ్‌బెన్, నిర్మల, జస్సీ, మీరాను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.

కాగా, ఆశారాం బాపు ప్రస్తుతం రాజస్థాన్‌ జోధ్‌పూర్‌ జైలులో ఉన్నాడు. 2013లో జోధ్‌పూర్‌ ఆశ్రమంలో ఆయన తనపై లైంగికదాడికి పాల్పడినట్లు 16 ఏళ్ల బాలిక పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేసింది.  దీంతో ఆ ఏడాది ఆగస్ట్‌లో మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో ఉన్న ఆశారాం బాపును పోలీసులు అరెస్ట్‌ చేశారు. సెప్టెంబర్‌లో జోధ్‌పూర్‌కు తీసుకొచ్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన జోధ్‌పూర్‌ ట్రయల్ కోర్టు 2018లో ఆశారాం బాపును దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. దీంతో నాటి నుంచి ఆయన జోధ్‌పూర్‌ కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇవాళ గుజరాత్‌ కేసులో శిక్ష ఖరారు కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.