Air Vistara: విస్తారా విమానంలో మహిళ వింత ప్రవర్తన.. డ్రెస్ తీసేసి మరీ..
అబుదాబి-ముంబై విస్తారా విమానంలో ఓ మహిళ ప్రవర్తన అందరినీ షాక్‌కు గురిచేసింది. చివరకు ఆమెను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆమె ఏం చేసింది? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు?
అబుదాబి-ముంబై విస్తారా విమానంలో ఓ మహిళ ప్రవర్తన అందరినీ షాక్‌కు గురిచేసింది. చివరకు ఆమెను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆమె ఏం చేసింది? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలా పెర్రుకియో అనే మహిళ విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన అబుదాబి-ముంబై విమానంలో ఇటలీ నుంచి వచ్చింది. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించిన ఆమె.. ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకుంది. అయితే, ఫ్లైట్ ఎక్కాక.. తాను బిజినెస్ క్లాస్‌లో కూర్చుంటానంటూ విమాన సిబ్బందితో ఘర్షణకు దిగింది. సిబ్బంది తిరస్కరించడంతో వారిపై పిడిగుద్దులు గుద్దింది. ఉమ్మివేస్తూ అసభ్యంగా ప్రవర్తించింది. అంతటితో ఆగక.. డ్రెస్ విప్పేసి అర్థ నగ్నంగా హంగామా చేసింది. దాంతో విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విమానం ముంబై చేరుకున్న వెంటనే సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటలీకి చెందిన పాలో పెరుకియోగాను కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. బెయిల్ మంజూరైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..