వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. 15-20 రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. కోల్కతా - గౌహతి మధ్య తొలి సేవలు ప్రారంభమవుతాయి. 180 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైళ్లలో అధునాతన సౌకర్యాలున్నాయి. మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకొని విమాన ఛార్జీల కన్నా తక్కువ ధరలకు (3AC రూ.2300, 2AC రూ.3000, 1AC రూ.3600) టికెట్లు లభిస్తాయి.