Srisialam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. ఇవాళ్టి నుంచి సర్వదర్శనానికి అనుమతి

శ్రీశైల మల్లన్న క్షేత్రంలో బుధవారం నుంచి భక్తులకు సర్వ దర్శనాలు కల్పించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ EO కేఎస్‌ రామారావు తెలిపారు. కరోనా నిబంధనల..

Srisialam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. ఇవాళ్టి నుంచి సర్వదర్శనానికి అనుమతి
Srisailam Darshanam
Follow us

|

Updated on: Aug 18, 2021 | 8:33 AM

Srisialam Temple: శ్రీశైల మల్లన్న క్షేత్రంలో బుధవారం నుంచి భక్తులకు సర్వ దర్శనాలు కల్పించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ EO కేఎస్‌ రామారావు తెలిపారు. కరోనా నిబంధనల దృష్ట్యా గర్భాలయ అభిషేకాలను ఏడు విడుతలుగా, సామూహిక అభిషేకాలు నాలుగు విడుతలుగా కల్పించాలని నిర్ణయించారు. అలాగే VIP బ్రేక్‌ దర్శనాలు మూడు విడుతలుగా కల్పించనున్నారు. అభిషేకంతో పాటు దేవాలయంలో జరిగే సేవల టికెట్లన్నీ ఆన్‌లైన్‌, కరెంటు బుకింగ్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని EO వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం. నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలపై కూడా పడింది. కరోనా వైరస్ కట్టడి కోసం నిత్యం రద్దీగా ఉండే ఆలయాల్లో భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. ఆలయాలు సైతం మూతపడ్డాయి. ఇటీవల ఆంక్షల సడలింపుతో కొన్ని ఆలయాలు పూర్తి స్థాయిలో తెరుచుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో తాజా మల్లన్న భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా కరోనా నిబంధనలను అనుసరించి దర్శనాలకు అనుమతిస్తున్నారు.

ఇవాళ్టి నుండి శ్రీశైలంలో స్పర్శ దర్శనం ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుంచి భక్తుల సౌకర్యార్థమై దశల వారిగా స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించేందుకు వీలు కల్పిస్తున్నారు.

గర్భాలయ అభిషేకాలు :

కరోనా నిబంధనలు దృష్టిలో ఉంచుకుని కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ అభిషేకాలు నిర్వహింపబడుతాయి. ఇందులో భాగంగా రోజుకు 7 విడతలలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహించబడుతాయి. రోజుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 6 విడతలలోనూ, సాయంకాలం ఒక విడతగాను ఈ గర్భాలయ అభిషేకాలు నిర్వహించబడుతాయి. భక్తులు కరెంట్ బుకింగ్ ద్వారా ఈ అభిషేకసేవా టికెట్లను పొందవచ్చును.

సామూహిక అభిషేకాలు:

ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలను నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా మరియు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా ఈ టికెట్లను పొందే అవకాశం. మొదటి విడత గం. 6.30లకు రెండవ విడత గం. 10.00 గంటలకు మూడవ విడత 12.30 గంటలకు నాల్గవ విడతలుగా సాయంత్రం 6.30 గంటలకు నిర్వహించబడుతాయి. సామూహిక అభిషేక సేవాకర్తలకు అభిషేకానంతరం స్వామివారి స్పర్శదర్శనం కల్పించబడుతుంది.

ఇవి కూడా చదవండి: Jana Ashirwad Yatra: ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన యాత్ర..

వర్షాకాలంలో ఏదైనా తినండి.. తినకండి.. కానీ మర్చిపోయి కూడా చేపలు తినవద్దు.. ఎందుకో తెలుసా.. ఇది నిజం తెలిస్తే మీరు కూడా తినరు..

26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే