Jana Ashirwad Yatra: ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన యాత్ర..

జనంలోకి వెళ్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరిస్తూనే.. జనం ఆశీర్వాదం తీసుకునేందుకు యాత్ర చేపట్టారు. ఏపీలో రెండు రోజులు.. తెలంగాణలో మూడు రోజుల పాటు

Jana Ashirwad Yatra: ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన యాత్ర..
Jan Ashirwad Yatra G Kishan
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Aug 18, 2021 | 8:25 AM

జనంలోకి వెళ్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరిస్తూనే.. జనం ఆశీర్వాదం తీసుకునేందుకు యాత్ర చేపట్టారు. ఏపీలో రెండు రోజులు.. తెలంగాణలో మూడు రోజుల పాటు సాగనుందీ యాత్ర. కేంద్రంలో బీజేపీ పాలన ఏడేళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ్టి నుంచి యాత్ర చేపట్టనున్నారు. దీనికి జన ఆశీర్వాద యాత్రగా నామకరణం చేశారు. యాత్ర పొడవునా బీజేపీ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను కిషన్ రెడ్డి వివరిస్తూ ముందుకు సాగుతారు.

ఇవాళ తిరుమల చేరుకోనున్న కిషన్ రెడ్డి.. గురువారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుని కోదాడకు బయలుదేరుతారు. తిరుపతి, విజయవాడ పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో కిషన్ రెడ్డి యాత్ర సాగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు కోదాడ తిరుమలపూర్ గ్రామం చేరుకుంటారు. రాత్రి సూర్యాపేటలో బస చేస్తారు.

20న దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట మీదుగా వరంగల్‌లోకి ప్రవేశిస్తారు. అక్కడ భద్రకాళి మాతను దర్శనం చేసుకుని వరంగల్‌, హన్మకొండలో తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. వరంగల్‌లో టీకా కేంద్రాన్ని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత సర్వాయి పాపన్న గ్రామమైన ఖిలాషాపూర్‌.. అక్కడి నుంచి జనగామ, ఆలేరుకు చేరుకుంటారు.

అక్కడ పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంను కలుస్తారు. అనంతరం యాదాద్రి చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. ఆ రాత్రి యాదాద్రిలోనే బస చేస్తారు. 21న ఉదయం భువనగిరిలో రేషన్‌ దుకాణంలో బియ్యం పంపిణీని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఘట్‌కేసర్‌, ఉప్పల్‌ మీదుగా నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.

యాత్ర మధ్యలో అక్కడక్కడ మొత్తం 40 చోట్ల సభలకు ఏర్పాట్లు చేశారు కమలనాథులు. యాత్రలో భాగంగా సేంద్రియ వ్యవసాయంలో జాతీయ అవార్డు గ్రహీతను కోదాడలో సన్మానిస్తారు. ఈ యాత్రలో బీజేపీ తెలంగాణ అధ్య అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారని పార్టీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి: Viral Video: ‘బుల్లెట్టు బండి’ పాటకి అదిరిపోయే స్టెప్స్ వేసిన పెళ్లికూతురు..! పరేషన్ అయిన పెళ్లి కొడుకు..