AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘బుల్లెట్టు బండి’ పాటకి అదిరిపోయే స్టెప్స్ వేసిన పెళ్లికూతురు..! పరేషన్ అయిన పెళ్లి కొడుకు..

Viral Video: ప్రతి వధూవరులకు పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది. తమ వివాహ వేడుకను చిరస్మరణీయంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. అందుకోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే

Viral Video: ‘బుల్లెట్టు బండి’ పాటకి అదిరిపోయే స్టెప్స్ వేసిన పెళ్లికూతురు..! పరేషన్ అయిన పెళ్లి కొడుకు..
Telangana Bride Dance
uppula Raju
|

Updated on: Aug 18, 2021 | 6:06 AM

Share

Viral Video: ప్రతి వధూవరులకు పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది. తమ వివాహ వేడుకను చిరస్మరణీయంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. అందుకోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే వివిధ రకాల ప్రాంతాలను బట్టి వివిధ రకాల వివాహ పద్దతులు ఉంటాయి. తెలంగాణలో మాత్రం పెళ్లి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బరాత్ మాత్రమే. పెళ్లి తంతు ముగియగానే చివరలో వధూవరులిద్దరిని ఊరేగించడం సంప్రదాయం. అందులో భాగంగానే డీజేలు పెట్టి మాస్ పాటలతో హంగామా చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి చిందేస్తారు. ఇందులో భాగంగానే వధూవరులిద్దరిని కూడా డ్యాన్స్‌ చేయడానికి ఆహ్వానిస్తారు. తాజాగా ఓ మాస్‌ పాటకి వధువు చేసిన డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో గమనించినట్లయితే.. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ పొందిన ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా’ అనే డీజే పాటకి వధువు సూపర్‌గా డ్యాన్స్ చేస్తుంది. ఈ పాటకి వధువు చేసిన డ్యాన్స్ చూస్తూ వరుడు పరేషాన్ అవుతాడు. తాను కూడా డ్యాన్స్ చేయాడానికి ప్రయత్నించినా వధువు స్టెప్స్ చూసి అలాగే నిలుచుండిపోతాడు. అందమైన ఆడ నెమలి నృత్యంలా ఆమె డ్యాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అచ్చమైన తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఒక్క యూట్యూబ్‌లోనే కాదు బయట కూడా మార్మోగుతోంది. తెలంగాణలో పెళ్లి బరాత్ కానీ ఏ ఫంక్షన్‌ అయినా సరే జానపద పాటలు దద్దరిల్లాల్సిందే. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా ’ అనే పాట యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ పొందింది. రచయిత లక్ష్మణ్‌ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఎస్‌కే బాజి సంగీతం అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది.

Viral Photos: ఈ ఫొటోలు చూస్తే మనసు ఎటో వెళ్లిపోతుంది..! భారతదేశంలో అత్యంత అందమైన ప్రదేశాలు..

Thadepalli Town: తాడేపల్లి పట్టణంలో రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Crime News: దారుణం.. మగ పిల్లాడి కోసం 8 సార్లు అబార్షన్.. 1500కు పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు..