Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: దారుణం.. మగ పిల్లాడి కోసం 8 సార్లు అబార్షన్.. 1500కు పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు..

Crime News: ఆడపిల్లలు అన్ని రంగాల్లో విజయంతంగా దూసుకుపోతున్నారు. మగవారితో సమానంగా అన్ని పనులు చేస్తున్నారు. అంతరిక్షంలోకి వెళుతున్నారు.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తున్నారు. అయినా

Crime News: దారుణం.. మగ పిల్లాడి కోసం 8 సార్లు అబార్షన్.. 1500కు పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు..
Mumbai Woman
Follow us
uppula Raju

|

Updated on: Aug 18, 2021 | 5:55 AM

Crime News: ఆడపిల్లలు అన్ని రంగాల్లో విజయంతంగా దూసుకుపోతున్నారు. మగవారితో సమానంగా అన్ని పనులు చేస్తున్నారు. అంతరిక్షంలోకి వెళుతున్నారు.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తున్నారు. అయినా సమాజంలో వారిపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల అని తెలియగానే పురిటిలోనే చంపేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. తాజాగా ముంబైలో మగపిల్లాడు కావాలని భార్యకు 8 సార్లు అబార్షన్ చేయించాడు ఓ నీచపు భర్త. విసిగివేజారిని భార్య చివరకు వేధింపులు తట్టుకోలేక అతడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

బాధిత మహిళకు 2007లో వివాహం కాగా 2009లో ఆమె మొదటి సారిగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. 2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో తనకు వారసుడే కావాలంటూ భర్త అబార్షన్‌ చేయించాడు. మరోవైపు తానూ కూడా చికిత్స చేయించుకోవడం మొదలుపెట్టాడు. ప్రీ ఇంప్లాంటేషన్‌, లింగ నిర్ధారణ తదితర అంశాలకు మన దేశంలో అనుమతి లేకపోవడంతో ఆమెను బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఎనిమిది సార్లు గర్భస్రావం చేయించాడు. చికిత్స, ఆయా పరీక్షల సమయంలో ఆమెకు 1,500కుపైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించాడు. ముంబయిలోని దాదర్‌ ప్రాంతంలో ఈ ఘటన జరగింది.

అయినప్పటికీ భర్త ఆమెను వదిలిపెట్టలేదు. మగబిడ్డ కోసం నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. స్టెరాయిడ్ ఇంజెక్షన్ల వల్ల ఇప్పటికే ఆమె ఆరోగ్యం దెబ్బతింది తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇక భర్త వేధింపులు తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. దీంతో అసలు వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మగబిడ్డ కోసం భ్రూణ హత్యలకు పాల్పడిన అతడిపై మహిళాలోకం మండిపడుతుంది. మరోసారి ఎవ్వరూ ఇలాంటి పనిచేయకుండా కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి.

Crime News: పోలీస్ స్టేషన్‌లో కొట్టుకున్న న్యాయవాదులు.. నలుగురికి తీవ్ర గాయాలు..

Prime Minister Modi: ప్రధాని మోదీని కించపరుస్తూ వీడియో.. చెన్నై వ్యక్తిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు..

రండిబాబూ రండి.. మంచి తరుణం మించిన దొరకదన్నాడు. కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాకులు

Crime News: వీడసలు మనిషేనా.. కట్టుకున్న భార్య నచ్చలేదని ఎంతటి ఘోరానికి పాల్పడ్డాడో తెలిస్తే షాక్ అవుతారు..