AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prime Minister Modi: ప్రధాని మోదీని కించపరుస్తూ వీడియో.. చెన్నై వ్యక్తిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు..

Prime Minister Modi: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు చెన్నైకి చెందిన 62 ఏళ్ల మన్మోహన్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసు బృందం అరెస్ట్ చేసింది.

Prime Minister Modi: ప్రధాని మోదీని కించపరుస్తూ వీడియో.. చెన్నై వ్యక్తిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు..
Shiva Prajapati
|

Updated on: Aug 17, 2021 | 10:20 PM

Share

Prime Minister Modi: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు చెన్నైకి చెందిన 62 ఏళ్ల మన్మోహన్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసు బృందం అరెస్ట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన మన్మోహన్ మిశ్రా గత 35 సంవత్సరాలుగా చెన్నైలో నివసిస్తున్నడు. అతను ఒక యూట్యూబ్ చానెల్‌ను రన్ చేస్తున్నాడు. అయితే, తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.

ఈ యూట్యూబ్ చానెల్‌ వేదికగా మన్మోహన్ మిశ్రా గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. అరెస్ట్‌కి ఒక రోజు ముందు కూడా అంటే ఆగస్టు 13న విడుదల చేసిన వీడియోలో మన్మోహన్ మిశ్రా ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోల్లో ప్రధాని మోదీని ఏకవచనంతో సంబోధిస్తూ.. విమర్శలు గుప్పించాడు. ప్రధాని విధానపరమైన నిర్ణయాలను, కోవిడ్ సంబంధిత అంశాలను ప్రశ్నిస్తూ దూషించాడు. ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. ఈ వీడియోను చూసి యూపీకి చెందిన పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేయడానికి రెండు రోజుల ముందు చెన్నై చేరుకున్నారు. మన్మోహన్ మిశ్రా అరెస్ట్‌కు సంబంధించి స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. అరెస్ట్ చేసిన తరువాత ట్రాన్సిల్ రిమాండ్‌ కోరుతూ.. మిశ్రాను మాధవరం మెజిస్టీరియల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు మిశ్రా ట్రాన్సిల్ రిమాండ్ మంజూరు చేసింది. అయితే, మిశ్రాపై దాఖలైన అభియోగాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు.

Also read:

Crime News: వీడసలు మనిషేనా.. కట్టుకున్న భార్య నచ్చలేదని ఎంతటి ఘోరానికి పాల్పడ్డాడో తెలిస్తే షాక్ అవుతారు..

Viral Video: చెత్త ఏరుకునే బామ్మ.. ఇంగ్లీష్ ఇరగదీసింది.. ఆమె మాటలు వింటే మీరూ షాక్ అవుతారు..

Viral Video: పాపం ఎంత పని అయిపాయే.. మహిళతో డ్యాన్స్ చేస్తుండగా ఊహించని షాక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..