Crime News: వీడసలు మనిషేనా.. కట్టుకున్న భార్య నచ్చలేదని ఎంతటి ఘోరానికి పాల్పడ్డాడో తెలిస్తే షాక్ అవుతారు..
Crime News: హర్యానాలోని పానిపట్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య తీరుపై విరక్తి చెందిన భర్త.. ఆమెను హతమార్చేందుకు మైండ్ బ్లాంక్ అయ్యే ప్లాన్ వేశాడు.
Crime News: హర్యానాలోని పానిపట్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య తీరుపై విరక్తి చెందిన భర్త.. ఆమెను హతమార్చేందుకు మైండ్ బ్లాంక్ అయ్యే ప్లాన్ వేశాడు. ఆమె పేరిట తీసుకున్న వాహనాలకు ఈఎంఐ చెల్లించకుండా ఉండేందుకు, ఆమె పేరిట వచ్చే రూ. 15 లక్షల బీమా సొమ్మును కాజేసేందుకు ఊహించని స్కెచ్ వేశాడు. కట్టుకున్న భార్య.. లారీ ముందు తోసేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ప్లాన్ ప్రకారం భార్యను చంపేశాడు. కానీ, ఆ తరువాతే కథ అడ్డం తిరగడంతో.. అడ్డంగా బుక్కయ్యాడు.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పానిపట్ జిల్లాకు చెందిన నసీబ్.. జూన్ 30వ తేదీన తన భార్యను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన భార్య జరీనా అనారోగ్యానికి గురవగా.. చికిత్స కోసం కారులో పానిపట్‌కు తీసుకెళ్తున్నానని, ఆ సమయంలో రోహ్‌తక్ బైపాస్ దాటుతుండగా తన భార్య వాంతి చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను కారును రోడ్డు పక్కన పార్క్ చేస్తుండగా.. జరీనా నడి రోడ్డుపై నడుస్తోందని, ఇంతలో ఓ ట్రక్ వచ్చి ఆమెను ఢీకొట్టిందని, ఆ ఘటనలో జరీనా అక్కడికక్కడే చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు నసీబ్. అయితే, లాడీ డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా పరారయ్యాడని, ట్రక్ నంబర్ లేదని అందులో తెలిపాడు.
నసీబ్ స్టేట్‌మెంట్ ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, దర్యాప్తు సమయంలో నసీబ్ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు.. నసీబ్‌ను కూడా తమదైన శైలిలో విచారించారు. దాంతో అసలు విషయం వెలుగు చూసింది. పోలీసుల సమగ్ర విచారణలో నసీబే తన భార్యను చంపినట్లు అంగీకరించాడు. తన భార్య తనకు నచ్చలేదని, అందుకే ఆమెను చంపేసినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాదు.. జరీనాను చంపేస్తే ఆమె పేరిట వచ్చే బీమా సొమ్మును తీసుకోవచ్చని ప్లాన్ వేసినట్లు పోలీసుల ఎదుట వెల్లడించాడు.
నిందితుడు నసీబ్ జూన్ నెలలో తన భార్య జరీనా పేరిట ద్విచక్ర వాహనం, ఐ -10 కారు తీసుకున్నాడు. ఫైనాన్స్‌లో తీసుకున్న ఈ వాహనాలకు మిగిలిన వాయిదాలను చెల్లించకుండా ఉండేందుకు, వాహన యజమాని చనిపోతే వచ్చే రూ .15 లక్షల బీమాను కాజేయాలని నసీబ్ ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్‌లో భాగంగానే.. నిందితుడు నసీబ్ తన భార్య జరీనాను జూన్ 30న పానిపట్-రోహ్‌తక్ బైపాస్‌పై శివార్లకు తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఆమెతో ఘర్షణకు దిగాడు. అప్పటికే పక్కా ప్లాన్‌తో ఉన్న నసీబ్.. రోడ్డుపై ట్రక్కు వస్తున్న సమయంలో ఆమెను దాని కిందకు నెట్టేశాడు. ఆ ఘటనలో జరీనా స్పాట్‌లోనే చనిపోయింది. ట్రక్ డ్రైవర్ భయంతో వాహనం ఆపకుండా వెళ్లిపోయాడు. ఇలా జరీనా హత్యలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసిన నసీబ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read:
Viral Video: చెత్త ఏరుకునే బామ్మ.. ఇంగ్లీష్ ఇరగదీసింది.. ఆమె మాటలు వింటే మీరూ షాక్ అవుతారు..
Telangana Corona Updates: తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న పాజిటివ్ కేసులు.. ఈ ప్రాంతంలో మాత్రం..