AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాపం ఎంత పని అయిపాయే.. మహిళతో డ్యాన్స్ చేస్తుండగా ఊహించని షాక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పెళ్లి వేడుకలకు సంబంధించి హస్యపూరితమైన ఎన్నో వీడియోలు నిత్యం సర్క్యూలేట్..

Viral Video: పాపం ఎంత పని అయిపాయే.. మహిళతో డ్యాన్స్ చేస్తుండగా ఊహించని షాక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Viral Video
Shiva Prajapati
|

Updated on: Aug 17, 2021 | 8:59 PM

Share

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పెళ్లి వేడుకలకు సంబంధించి హస్యపూరితమైన ఎన్నో వీడియోలు నిత్యం సర్క్యూలేట్ అవుతుంటాయి. ఆ ఫన్నీ వీడియోలను చూసి ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇట్టే మర్చిపోయి రిలాక్స్ అవుతుంటారు జనాలు. అలాంటి వీడియోనే ఒకటి తాజాగా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు. సాధారణంగా.. కొందరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుంటే ప్యాంట్ చినిగిపోవడమో, కింద పడిపోవడం లాంటి వీడియోలు ఇప్పటికే చూసి ఉంటారు. ఇక పెళ్లి వేడుకపై పెళ్లి కొడుకు ప్యాంట్ జారిపోవడం వీడియోలు కూడా చూశారు. అచ్చం ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అయితే, ఈసారి పెళ్లి కొడుకు ప్యాంట్ జారిపోలేదు. ఒక పెద్ద మనిషి ప్యాంట్ జారిపోయింది. దాంతో అక్కడ అంతా ఒక్కసారిగా నవ్వులు పూశాయి.

ఈ వైరల్ వీడియోలో ఏముందంటే.. ఓ ఫంక్షన్‌కు హాజరైన జంట.. సరదాగా డ్యాన్స్ చేస్తోంది. ఆ వ్యక్తి తన సహచర మహిళ చెక్కిళ్లపై ముద్దు పెడుతూ డ్యాన్స్ చేస్తున్నాడు. వారు డ్యాన్స్ చేయడాన్ని ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు షూట్ చేస్తున్నారు. కెమెరావైపు చూస్తూ మరింత రెచ్చిపోయాడు ఆ వ్యక్తి. మహిళ నడుము పట్టుకుని తనదై శైలిలో వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే ఇంతలో అతనికి ఊహించని షాక్ తగిలింది. డ్యాన్స్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఆ వ్యక్తి ప్యాంట్ జారిపోయింది. వెంటనే అలర్ట్ అయిన ఆ వ్యక్తి.. ప్యాంట్ సెట్ చేసుకుంటాడు. ఈ సీన్ అంతా పక్కనే ఉండి ఫోటోలు, వీడియో తీస్తున్న ఫోన్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్ యూజర్ ఐడీ ‘యంగ్‌ల్యాండ్‌లార్డ్ 01’ లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను షేర్ చేసిన రోజు వ్యవధిలోనే వేలాది మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటూ.. స్మైల్ ఎమోజీలు కామెంట్‌గా పెడుతున్నారు. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

Telangana Corona Updates: తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న పాజిటివ్ కేసులు.. ఈ ప్రాంతంలో మాత్రం..

Black Fungus Effect: బ్లాక్ ఫంగస్‌ భయంతో దంపతుల ఆత్మహత్య.. అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు దాచి మరీ..

Neeraj Chopra: ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..