Black Fungus Effect: బ్లాక్ ఫంగస్‌ భయంతో దంపతుల ఆత్మహత్య.. అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు దాచి మరీ..

Black Fungus-Corona Effect: బ్లాక్ ఫంగస్ భయంతో ఒక జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో చోటు చేసుకుంది.

Black Fungus Effect: బ్లాక్ ఫంగస్‌ భయంతో దంపతుల ఆత్మహత్య.. అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు దాచి మరీ..
Suicide
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 17, 2021 | 7:46 PM

Black Fungus-Corona Effect: బ్లాక్ ఫంగస్ భయంతో ఒక జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో చోటు చేసుకుంది. కరోనా సోకిన ఈ జంట.. బ్లాక్ ఫంగస్ వస్తుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసి తనువు చాలించారు. ‘నా భార్యకు మధుమేహం. వార్తా ఛానెళ్ల ప్రకారం.. కరోనా సోకిన, డయాబెటిస్ ఉన్న రోగులందరికీ బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల శరీరంలోని అవయవాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దీని చికిత్సకు భారీ మొత్తం ఖర్చు అవుతుంది. అంత మొత్తం భరించే స్థాయి మాకు లేదు. అందుకే మేం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

ఈ దంపతుల ఆత్మహత్యకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళూరుకు చెందిన రమేష్(40), గుణ సువర్ణ(35) ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. రమేష్ భార్య గుణ సువర్ణ కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతోంది. అయితే, ఇటీవల వీరిద్దరూ గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో బ్లాక్ ఫంగస్‌పై టీవీ ఛానళ్లలో వస్తున్న వార్తలు వారిని మరింత కలవరానికి గురి చేసింది. బ్లాక్ ఫంగస్ సోకితే.. చికిత్స చేయించుకునే స్థోమత లేదని హడలిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

కాగా, తమ నిర్ణయాన్ని వీడియోలో తెలుపుతూ ఆ వీడియోను మంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఎన్. శశి కుమార్‌కు పంపించారు. ఆ వీడియోలో కూడా బ్లాక్ ఫంగస్‌పై భయాన్ని వ్యక్తం చేశారు. బ్లాక్ ఫంగస్‌ కారణంగా భయాందోళనకు గురవుతున్నామని, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామంటూ ఆ వీడియోలో దంపతులిద్దరూ తెలిపారు. ఈ వీడియోపై స్పందించిన కమిషనర్ ఎలాంటి తీవ్రమైన చర్యకు పాల్పడొద్దని ఆ దంపతులకు విజ్ఞప్తి చేశారు. ఆ దంపతులు ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేశారు. ఈ దంపతులను సంప్రదించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి వారు ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నారు. అయితే, అప్పటికే ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతులకు ఆత్మహత్యకు బ్లాక్ ఫంగస్ కారణంతో పాటు.. వీరికి పిల్లలు పుట్టకపోవడం కూడా ఒక కారణం అని పోలీసులు గుర్తించారు.

ఇదిలాఉంటే.. ఈ దంపతులు తమ అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు కూడా పేర్కొన్నారు. ‘‘మా దహన సంస్కారాలు సంప్రదాయం ప్రకారం చేయండి. దీనికోసం లక్ష రూపాయలు దాచి ఉంచాము. పోలీస్ కమీషనర్ ఎన్ శశికుమార్, శరణ్ పంప్‌వెల్, సత్యజిత్ సురత్‌కల్ మా అంత్యక్రియలకు సహకరించాలి’’ అని ఆ జంట విజ్ఞప్తి చేసింది. అంతేకాదు.. తమ ఇంట్లోని వస్తువులను పేదలకు పంచాలని సూచించారు. ఈ దంపతుల ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Neeraj Chopra: ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

Property Benefits: భార్య పేరు మీద ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?.. ఆసక్తికర విషయాలు మీకోసమే..

Health Tips: షుగర్ పేషెంట్లు ఏ పండ్లు తినొచ్చు.. ఏ పండ్లు తినొద్దు.. పూర్తి వివరాలు మీకోసం..

ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!