రండిబాబూ రండి.. మంచి తరుణం మించిన దొరకదన్నాడు. కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాకులు

రండిబాబూ రండి.. మంచి తరుణం మించిన దొరకదన్నాడు.  కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాకులు
Cheating

రండిబాబూ రండి.. మంచి తరుణం మించిన దొరకదన్నాడు. గోల్డ్ స్కీం అంటూ ఆశలు పెట్టాడు. అధికవడ్డీలు ఇస్తామంటూ చిట్టీలు వేయించాడు. నమ్మకంగా నలుగురితో ఉంటూ బంగారం వ్యాపారం పేరుతో..

Venkata Narayana

|

Aug 17, 2021 | 10:08 PM

Cheating Business: రండిబాబూ రండి.. మంచి తరుణం మించిన దొరకదన్నాడు. గోల్డ్ స్కీం అంటూ ఆశలు పెట్టాడు. అధికవడ్డీలు ఇస్తామంటూ చిట్టీలు వేయించాడు. నమ్మకంగా నలుగురితో ఉంటూ బంగారం వ్యాపారం పేరుతో.. అనధికార చిట్టిలు పెట్టి, ప్రజలను మోసం చేసి పారిపోయాడు. వివరాల్లోకి వెళితే, పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో బంగారం వ్యాపారి చీమకుర్తి రాజా. వెంకటగణేష్‌ జువెలరీ పేరుతో గోల్డ్‌ స్కీమ్‌ నడిపాడు. 15 నెలల పాటు నెలకు 2 వేల రూపాయలు చెల్లిస్తే.. 16వ నెలకు రెండు వేలు కలిపి 32 వేలకు బంగారు నగలు ఇస్తామని స్కీమ్‌ మొదలుపెట్టాడు.

ఈ స్కీమ్‌కు ఆకర్షితులైన స్థానికులు 100 మందికి పైగానే నెలానెలా వాయిదాలు కట్టారు. సరిగ్కా స్కీమ్‌ ముగుస్తుందని అనుకుంటున్న టైమ్‌లో రాజా షాపు మూసేసి పత్తా లేకుండా పారిపోయాడు. ఫ్యామిలీతో సహా చెక్కేసాడు. గోల్డ్‌ స్కీమ్‌, వడ్డీలు, చిట్టీలు కలపి మొత్తంగా సుమారు 60 లక్షలు టోపి పెట్టి పారిపోయాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోల్డ్‌స్కీమ్‌, చిట్టీల పేరుతో నిండా ముంచాడని బాధితులు లబోదిబోమంటున్నారు. గోల్డ్ స్కీం అంటూ స్థానికుల నుండి భారీ మొత్తంలోనే డబ్బులు వసూలు చేశాడు చీమకుర్తి రాజా. దీంతో రాజా ఇంటివద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు బాధితులు. రాజా చేసిన మోసంపై ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు. చకచక్యంగా రాజాను అరెస్ట్ చేసారు. చీటింగ్ కేసుతో సహా.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు. తాము కట్టిన డబ్బులు ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు బాధితులు.

Read also: Vizag Steel: వైజాగ్ స్టీల్ అంశంలో కీలక మలుపు.. కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన దిగ్గజ సంస్థ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu