Vizag Steel: వైజాగ్ స్టీల్ అంశంలో కీలక మలుపు.. కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన దిగ్గజ సంస్థ

వైజాగ్ స్టీల్స్‌లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ అంశం కీలక మలుపు తీసుకుంది. ఆర్‌ఐ‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలోని విశాఖ స్టీల్స్‌ని కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్స్ ఆసక్తిని చూపింది. ఈ విషయాన్ని టాటా

Vizag Steel: వైజాగ్ స్టీల్ అంశంలో కీలక మలుపు.. కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన దిగ్గజ సంస్థ
Vizag Steel
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 17, 2021 | 10:00 PM

Vizag Stell: వైజాగ్ స్టీల్స్‌లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ అంశం కీలక మలుపు తీసుకుంది. ఆర్‌ఐ‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలోని విశాఖ స్టీల్స్‌ని కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్స్ ఆసక్తిని చూపింది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సి.ఇ.ఓ, మేనేజింగ్ డైరెక్టర్ టి.వి. నరేంద్రన్ జాతీయ మీడియాతో నిర్దారించారు. కొనుగోలుపై ఇప్పటికే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థాయి లో కసరత్తు చేశామని, కొనుగోలు ప్రక్రియలో మేము పాల్గొంటున్నాం అని స్పష్టం చేశారు నరేంద్రన్. సరైన సమయంలో దీనిపై కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు.

ఇలా ఉండగా, అమ్మకానికి అవసరమైన న్యాయ, వ్యవహారాల సలహాదారుల ఎంపిక కోసం టెండర్లను పిలిచిన కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని దీపం డిపార్ట్మెంట్ ఈనెల 26న వాటి తుది ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్టు ప్రకటించింది. న్యాయ సలహా దారు ఎంపిక తర్వాత కొనుగోలు ప్రక్రియ వేగవంతం కానుంది.

22 వేల ఎకరాలలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం లోని 100 శాతం కేంద్ర ప్రభుత్వ వాటాలను అమ్మాలని గత జనవరి 27 వ తేదీన ఆర్ధిక వ్యవహరాల పై ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఉక్కు కార్మికులు పరిరక్షణ పోరాట సమితి పేరుతో పెద్ద ఎత్తున పోరాటలు చేసింది. ఏకంగా ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ లో సైతం నిరసన దీక్షలు చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పలు దఫాలు ప్రధానికి లేఖలు కూడా రాశారు.

పెట్టుబడుల ఉపసంహరణ బదులు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ అనేక సూచనలు చేశారు. రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ లో గొడవ చేశారు. కొందరు ఏకంగా కోర్టులను ఆశ్రయించారు. అయినా ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. సరికదా అమ్మి తీరుతాం లేదంటే మూసివేస్తాం అంటూ అటు పార్లమెంట్ తో పాటు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

మరోవైపు అమ్మకపు ప్రక్రియను నిరాఘాటంగా కొనసాగిస్తూ వచ్చారు. అమ్మకానికి కీలకమైన న్యాయ సలహాదారు ఎంపిక కోసం పిలిచిన టెండర్లను ఈ నెల 26 న ఖరారు చేయనున్నారు. ఇందుకోసం దేశం లోని ప్రముఖ న్యాయ సలహా సంస్థలు కూడా బిడ్ దాఖలు చేస్తున్నట్టు సమాచారం.

Read also:  సరిహద్దు ప్రాంతంపై ఒడిశా కన్ను.. సాలూరు పరిధిలోని 34 కొటియా గ్రామాలను ఎలాగైనా గుప్పిట పట్టాలని పన్నాగం