సరిహద్దు ప్రాంతంపై ఒడిశా కన్ను.. సాలూరు పరిధిలోని 34 కొటియా గ్రామాలను ఎలాగైనా గుప్పిట పట్టాలని పన్నాగం

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాలపై ఒడిశా రాష్ట్రం కన్నేసిందని సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర చెప్పారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే

సరిహద్దు ప్రాంతంపై ఒడిశా కన్ను.. సాలూరు పరిధిలోని 34 కొటియా గ్రామాలను ఎలాగైనా గుప్పిట పట్టాలని పన్నాగం
Salur Mla
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 17, 2021 | 9:27 PM

Andhra-Odisha border Villages: ఆంధ్రా – ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాలపై ఒడిశా రాష్ట్రం కన్నేసిందని సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర చెప్పారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 34 కొటియా గ్రామాలను ఎలాగైనా గుప్పిటపట్టాలని కొత్త ఎత్తుగడలు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ ఆనవాళ్లనే అక్కడ లేకుండా చేయడానికి ఒడిశా దూకుడుగా వెళ్తోందని రాజన్నదొర వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో ఒడిశా తరచూ కవ్వింపు చర్యలకు దిగుతోందని ఎమ్మెల్యే రాజన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల భద్రత కోసమే సంయమనం పాటిస్తున్నామని చెప్పిన ఎమ్మెల్యే.. ఒడిశా చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొటియా గ్రామాల్లో ఒడిశా దూకుడుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.

ఒడిశా పన్నాగాలకు సంబంధించి ఫొటో, వీడియో ఆధారాలున్నాయని చెప్పిన ఎమ్మెల్యే రాజన్నదొర.. కొండంగి, సారిక, ధనసరాయి, సంపంగిపాడు, కురుకుట్టి సర్పంచ్‌లకు.. డబ్బు ఆశ చూపి లోబరుచుకుంటున్నారని విమర్శించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్డును పెకలించేసిన ఒడిశా అధికారులు తాజాగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారన్నారు రాజన్న.

అంతేకాకుండా, హడావుడిగా ఒడిశా ప్రభుత్వం కొన్ని శాశ్వత భవనాలను కూడా నిర్మిస్తుందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్మాణం తలపెట్టినా అభ్యంతరం చెబుతున్న అటవీ శాఖ అధికారులు.. ఒడిశా చర్యల విషయంలో మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు చేశారు.

Read also: Big News Big Debate: ముప్పు ముంగిట భారత్‌ ఉందా?.. ఆఫ్గన్‌లో పరిణామాలపై ఎందుకంత కలవరం?