Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చెత్త ఏరుకునే బామ్మ.. ఇంగ్లీష్ ఇరగదీసింది.. ఆమె మాటలు వింటే మీరూ షాక్ అవుతారు..

Viral Video: సాధారణంగా.. ప్రజల జీవన ప్రమాణం వారు చేసే పనులు, ముఖం చూసి నిర్ణయానికి వచ్చేస్తుంటారు చాలా మంది. కానీ, అది చాలా తప్పుడు అభిప్రాయం.

Viral Video: చెత్త ఏరుకునే బామ్మ.. ఇంగ్లీష్ ఇరగదీసింది.. ఆమె మాటలు వింటే మీరూ షాక్ అవుతారు..
Old Woman
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 17, 2021 | 9:24 PM

Viral Video: సాధారణంగా.. ప్రజల జీవన ప్రమాణం వారు చేసే పనులు, ముఖం చూసి నిర్ణయానికి వచ్చేస్తుంటారు చాలా మంది. కానీ, అది చాలా తప్పుడు అభిప్రాయం. మనిషిని మనిషిగా చూడాలి. వారి ప్రవర్తన, ధరించిన దుస్తులు, జీవన శైలి ఆధారంగా ఎదుటి వారితో ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకోవడం సరికాదు. ఇలాంటి ప్రవర్తన మనలోని అజ్ఞానాన్ని బయటపెడుతుందే తప్ప.. మనకు ఇసుమంతైనా మేలు చేయదు. ఇలాంటి జీవిత సత్యాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ ఏ ఒక్కరూ ఆ మాటలను చెవికెక్కించుకోరు. పైగా ఎదుటి వారు కాస్త తక్కువగా కనిపిస్తే చాటూ హీనంగా చూస్తుంటారు. అయితే, తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియో.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాదు.. తీవ్ర చర్చనీయాంశమైంది. చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ మహిళ ఇంగ్లీష్ భాషలో అనర్గళంగా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె మాటలు వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

జపాన్‌లో ఏడు సంవత్సరాలు.. ఈ మహిళకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రమ్‌లో itmeshachinaheggar అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోలో మహిళ తాను ఏడు సంవత్సరాలు జపాన్‌లో పని చేశానని చెప్పింది. ఆ తరువాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పింది. ఈ మహిళ తన జీవిత కథను పాట పాడుతూ చెబుతుండేది. అయితే, అందరూ ఆమెను పిచ్చిదానిలా అభివర్ణించేవారు. ఈ మహిళ పేరు సిసిలియా మార్గరెట్ లారెన్స్ అని తెలిపింది. కాగా, ఈ వీడియో ప్రకారం.. సిసిలియా మార్గరెట్ సదాశివనగర్‌ ప్రాంతంలో చెత్తను ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన సచిన్ హాగర్.. మహిళ గురించి ఇలా రాశారు. ‘‘ఇలాంటి కథలు మన చుట్టూ చాలానే ఉంటాయి. అయితే మనం నాలుగు వైపులా కళ్లు తెరిచి చూడాలంతే. ఈ అమెజింగ్ టాలెంటెడ్ మహిళకు అండగా ఉండాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఆ మహిళను సంప్రదించాలనుకుంటే.. దయచేసి తమను సంప్రదించండి.’’ అని పేర్కొన్నారు. కాగా, @ceciliaed_always పేజీలో సిసిలియా మార్గరెట్ మోడలింగ్ ఫోటోలు వైరల్‌గా మారాయి. వాస్తవానికి ఈ అకౌంట్ ఆమెది కాకపోయినా.. ఆమె ఫోటోలు మాత్రం ఉన్నాయి.

కాగా, సచిన్ హాగర్ షేర్ చేసిన ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మహిళ ఇంగ్లీష్ మాట్లాడటం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న సిసిలియా మార్గరెట్‌కు తాము సాయం చేస్తామంటూ పలువురు నెటిజన్లు ముందుకు వచ్చారు.

Viral Video:

Also read:

Viral Video: పాపం ఎంత పని అయిపాయే.. మహిళతో డ్యాన్స్ చేస్తుండగా ఊహించని షాక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Telangana Corona Updates: తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న పాజిటివ్ కేసులు.. ఈ ప్రాంతంలో మాత్రం..

Black Fungus Effect: బ్లాక్ ఫంగస్‌ భయంతో దంపతుల ఆత్మహత్య.. అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు దాచి మరీ..