AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thadepalli Town: తాడేపల్లి పట్టణంలో రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Thadepalli Town: అప్పుడప్పుడు ప‌ట్టణాలు, గ్రామాల్లోకి అడ‌వి జంతువులు రావ‌టం సర్వసాధారణం అయిపోయింది. కొన్ని చోట్ల పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగు బంట్లు వంటి క్రూర‌మృగాలు వచ్చి ఆగమాగం

Thadepalli Town: తాడేపల్లి పట్టణంలో రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
Python
uppula Raju
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 18, 2021 | 7:01 AM

Share

Thadepalli Town: అప్పుడప్పుడు ప‌ట్టణాలు, గ్రామాల్లోకి అడ‌వి జంతువులు రావ‌టం సర్వసాధారణం అయిపోయింది. కొన్ని చోట్ల పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగు బంట్లు వంటి క్రూర‌మృగాలు వచ్చి ఆగమాగం చేస్తున్నాయి. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో మ‌యూరాలు చేరి వ‌య్యారంగా నాట్యం చేసిన దృశ్యాలు కూడా మ‌నం చూశాం. అయితే తాడేపల్లి పట్టణంలో మాత్రం రోడ్డుపై కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో ప్రజలందరు భయంతో పరుగులు తీశారు.

పట్టణంలోని సలాం సెంటర్ వద్ద ఉన్నట్టుండి ఒక్కసారిగా కొండ చిలువ ప్రత్యక్షమైంది. అది 11 అడుగుల పొడవు ఉంటుంది. దానిని చూసిన జనాలు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశం నుంచి కొండచిలువ వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే అది భయంతో రోడ్డుపై నుంచి నివాసాల మధ్యకు వస్తున్న తరుణంలో స్థానికులు కొట్టి చంపారు. కొండచిలువ ఒక జంతువుని కానీ మనిషిని కానీ తింటే అది చెట్టుకు చుట్టుకొని అరిగించుకుంటుందని కొందరు చెప్తుంటారు. అయితే చనిపోయిన కొండచిలువని ఓ వ్యక్తి మెడలో వేసుకొని ఫొటో దిగడం విశేషం.

కప్పని పాము మింగిన సంద‌ర్బాలు మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కానీ పామును, మరో పాము మింగడం మాత్రం చాలా అరుదనే చెప్పార‌లి. అయితే, ఒక జాతికి చెందిన జంతువు, అదే జాతి జంతువు లేదా క్షీరదం తినడాన్ని కానిబాలిజం అని అంటారు. కొండచిలువ ఈ జాతికి చెందినదే. విష రహితమైన పెద్ద పాముల్లో కొండ చిలువ ప్రముఖమైనది. దానిని చూస్తే ఒళ్ళంతా జలదరిస్తుంది.. భయమేస్తుంది. ఎక్కవగా అడవుల్లో నివసించే ఈ కొండ చిలువలు జంతువులను ఆహారంగా తీసుకుంటుంటాయి. పలు సందర్భాల్లో కొండ చిలువలు మనుషులను మింగేసిన ఘటనలు వెలుగు చూశాయి.

Crime News: దారుణం.. మగ పిల్లాడి కోసం 8 సార్లు అబార్షన్.. 1500కు పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు..

Crime News: పోలీస్ స్టేషన్‌లో కొట్టుకున్న న్యాయవాదులు.. నలుగురికి తీవ్ర గాయాలు..

Afghanistan Crisis: మా 20 సంవత్సరాల పోరాటం ఫలించింది.. విదేశీ శక్తులు తరిమికొట్టాం.. ఫ్యూచర్‌పై తాలిబన్ ప్రతినిధి క్లారిటీ