AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కడప జిల్లాలో స్టార్ హీరో మూవీ షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్

రాజంపేటలో కోలీవుడ్ స్టార్ ధనుష్ సందడి చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని కొన్ని మైండ్ బ్లోయింగ్ సీన్లను రోళ్లమడుగు ఘాట్ రోడ్డు పరిసరాల్లో షూట్ చేస్తున్నారు. రాజంపేట లాడ్జిలో ల్యాండ్ బస చేసిన ధనుష్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Video: కడప జిల్లాలో స్టార్ హీరో మూవీ షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్
Dhanush New Movie Shooting In Rajampet
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jun 02, 2026 | 10:30 AM

Share

కడప జిల్లాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సందడి చేశారు. రాజంపేట మండల పరిధిలోని రోళ్లమడుగు శేషాచలం అడవుల్లో ధనుష్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ అప్‌డేట్ తెలియడంతో స్థానిక ప్రజలు, సినిమా అభిమానులు షూటింగ్ స్పాట్‌కు మరియు ధనుష్ బస చేసిన ప్రాంతానికి భారీగా క్యూ కట్టారు. రాజంపేట – రాయచోటి మధ్యలో ఉన్న ఘాట్ రోడ్ పరిధిలోని దట్టమైన శేషాచలం అడవులు ఎర్రచందనానికి ప్రపంచ ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న ఈ సినిమా కథ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుందని సమాచారం. అందులో భాగంగానే ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన కొన్ని అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలను, టాకీ పార్ట్‌ను ఈ రోళ్లమడుగు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.

చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో దాదాపు 5 రోజుల పాటు సుదీర్ఘంగా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇప్పటికే రెండు రోజుల పాటు అడవుల్లో హై-వోల్టేజ్ సీన్ల చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.సినిమా షూటింగ్ నిమిత్తం హీరో ధనుష్ రాజంపేటలోని ఒక ప్రముఖ లాడ్జిలో బస చేశారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో దావాగ్నిలా వ్యాపించడంతో తమ అభిమాన హీరోను ఒక్కసారైనా కళ్లారా చూడాలనే ఆరాటంతో స్థానిక ప్రజలు, యువకులు లాడ్జి వద్దకు భారీగా తరలివచ్చారు. ఫ్యాన్స్ తాకిడి పెరగడంతో అక్కడ భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రెండు రోజుల షూటింగ్ కంప్లీట్ చేసిన ధనుష్, మరో రెండు రోజుల పాటు రాజంపేటలోనే బస చేసి మిగిలిన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారు. శేషాచలం అడవుల బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకులలో సరికొత్త అంచనాలను రేకెత్తిస్తోంది.

వీడియో చూడండి..

Follow Us
గరుడ పురాణం ప్రకారం అత్యాచారాలు, లైంగిక దురాచారాలకు ఎంత ఘోరమైన..
గరుడ పురాణం ప్రకారం అత్యాచారాలు, లైంగిక దురాచారాలకు ఎంత ఘోరమైన..
స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!
స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!
వానాకాలం నాన్‌వెజ్ ముచ్చట.. చికెన్ vs మటన్.. ఏది తింటే మంచిది..?
వానాకాలం నాన్‌వెజ్ ముచ్చట.. చికెన్ vs మటన్.. ఏది తింటే మంచిది..?
ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం
ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం
గురు ఆదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
గురు ఆదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
టీ20 పరాభవాలకు వన్డేల్లో బదులు తీర్చుకుంటారా?
టీ20 పరాభవాలకు వన్డేల్లో బదులు తీర్చుకుంటారా?
చల్ల మిరపకాయలు ఇలా చేస్తే నోటికి రుచి.. కడుపుకు తేలిక..
చల్ల మిరపకాయలు ఇలా చేస్తే నోటికి రుచి.. కడుపుకు తేలిక..
2028 టీ20 ప్రపంచకప్‌ రేసు నుంచి ముగ్గురు భారత ఆటగాళ్లు ఔట్..?
2028 టీ20 ప్రపంచకప్‌ రేసు నుంచి ముగ్గురు భారత ఆటగాళ్లు ఔట్..?
గ్లామరస్ పాటలతో బాక్సాఫీస్ షేక్ చేసింది.. ఇప్పుడు ఇలా..
గ్లామరస్ పాటలతో బాక్సాఫీస్ షేక్ చేసింది.. ఇప్పుడు ఇలా..
ఓరీ దేవుడో ఇదేం పువ్వురా సామీ.. శవం కుళ్లిన కంపుతో చంపేస్తుందట..!
ఓరీ దేవుడో ఇదేం పువ్వురా సామీ.. శవం కుళ్లిన కంపుతో చంపేస్తుందట..!
స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!
స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!
ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం
ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం
ఇష్టంగా ఐస్‌క్రీములు లాగించేస్తున్నారా...అయితే ఈ సీన్ చూడాల్సిందే
ఇష్టంగా ఐస్‌క్రీములు లాగించేస్తున్నారా...అయితే ఈ సీన్ చూడాల్సిందే
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్‌ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
డాన్స్‌ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్‌
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్‌