AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Rama Navami: రామ నవమి రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి.. రామయ్య అనుగ్రహం మీ సొంతం

జ్యోతిషశాస్త్రం ప్రకారం శ్రీ రామనవమికి ​​ముందు కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకువస్తే, ప్రతికూల శక్తి అంతమై, లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. రామ నవమి పండుగ ఎంతటి విశిష్టమైన పండగ అంటే లక్షలాది మంది భక్తులు ఏడాది పొడవునా శ్రీ రామ నవమి పండగ కోసం వేచి ఉంటారు. ఈ నేపద్యంలో రాముయ్యకు ఇష్టమైన కొన్ని వస్తువులను రామ నవమి రోజున ఇంటికి తీసుకు రావడం శుభప్రదం. వీటిని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి. ఆ శుభప్రదమైన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.

Sri Rama Navami: రామ నవమి రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి.. రామయ్య అనుగ్రహం మీ సొంతం
Sri Rama Navami 2025
Surya Kala
|

Updated on: Apr 02, 2025 | 9:03 PM

Share

హిందువులు పవిత్రంగా జరుపుకునే శ్రీ రామ నవమి పండుగ దగ్గర పడుతోంది. రాములోరి కళ్యాణం కోసం యావత్ భక్త గణం ఎదురుచూస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీరాముడు, హనుమంతుడిని పూజించడం ద్వారా వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి, జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు వస్తాయి. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమి పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం శ్రీ రామ నవమి ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు. శ్రీ రాముడికి చాలా ఇష్టమైన విషయాలు ఉన్నాయి. శ్రీ రామ నవమి రోజున రామయ్యకి ఇష్టమైన కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవడం వలన రాముడి ఆశీస్సులు మాత్రమే కాదు హనుమంతుడు, లక్ష్మీ దేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి.

పసుపు దుస్తులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ రామ నవమికి ​​ముందు ఎవరైనా పసుపు వస్త్రం లేదా కొంత మొత్తంలో బంగారాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదం అని నమ్మకం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. భక్తుల ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఉండేలా అనుగ్రహం కరుపిస్తుంది.

శంఖం

శ్రీ రామ నవమికి ​​ముందు శంఖం కొని ఇంటికి తీసుకురండి. ఇంట్లోని పూజ గదిలో శంఖాన్ని ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కొందరు దేవుళ్ళ పూజలో శంఖం లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణింపబడుతున్నది. అటువంటి దేవుళ్ళలో ఒకరు హనుమంతుడు. కనుక శ్రీ రామ నవమికి ​​ముందు ఇంటికి శంఖాన్ని తీసుకురండి.

ఇవి కూడా చదవండి

కాషాయ జెండా

రామ నవమికి ​​ముందు కాషాయ జెండాను కొని మీ ఇంటికి తీసుకురావాలి. దీన్ని రామనవమి శుభ సందర్భంగా మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటి వైపు సానుకూల శక్తి ఆకర్షితులవుతుంది. ప్రతికూల శక్తి నశిస్తుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?