AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసాజ్ పేరుతో.. 61 మంది మహిళలను టార్గెట్ చేశాడు.. ఎన్నారైకి ఎన్నేళ్ల శిక్షపడిందో తెలుసా.?

భారత సంతతికి చెందిన మసాజ్ థెరపిస్ట్ సుమిత్ సతీష్ రస్తోగి (39)కి ఆస్ట్రేలియా కోర్టు 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించింది. అడిలైడ్‌లోని ఒక మసాజ్ పార్లర్‌లో 61 మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు కోర్టు నిర్ధారించింది. దీంతో ఈ మేరకు జైలు శిక్ష ఖరారు చేసింది. శిక్షలో 10 సంవత్సరాల 10 నెలల పాటు పెరోల్ లేకుండా జీవించాల్సి ఉంటుంది

మసాజ్ పేరుతో.. 61 మంది మహిళలను టార్గెట్ చేశాడు.. ఎన్నారైకి ఎన్నేళ్ల శిక్షపడిందో తెలుసా.?
Sumit Satish Rastogi
Balaraju Goud
|

Updated on: May 17, 2026 | 3:43 PM

Share

భారత సంతతికి చెందిన మసాజ్ థెరపిస్ట్ సుమిత్ సతీష్ రస్తోగి (39)కి ఆస్ట్రేలియా కోర్టు 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించింది. అడిలైడ్‌లోని ఒక మసాజ్ పార్లర్‌లో 61 మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు కోర్టు నిర్ధారించింది. దీంతో ఈ మేరకు జైలు శిక్ష ఖరారు చేసింది.

అడిలైడ్ పశ్చిమ శివారు ప్రాంతంలోని గ్లెనెల్గ్‌లో అక్టోబర్ 2021 నుండి జూలై 2022 మధ్య అతను ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడు. 55 అశ్లీల వీడియోల చిత్రీకరణ, 42 తీవ్రమైన లైంగిక దాడి కేసులు, మొత్తం 97 నేరాలకు గానూ రస్తోగి కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. 2011లో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చిన రస్తోగి, ఎటువంటి అధికారిక అర్హతలు లేకుండానే డబ్బులు తీసుకుంటూ మసాజ్ థెరపిస్ట్‌గా పనిచేసేవాడని విచారణలో తేలింది.

ఈ కేసును విచారించిన దక్షిణ ఆస్ట్రేలియా జిల్లా కోర్టు న్యాయమూర్తి కార్మెన్ మాటియో రస్తోగి ప్రవర్తన అదుపు తప్పిందని, దోపిడీకి పాల్పడేలా సాగిందని తీవ్రంగా అభివర్ణించారు. మహిళలపై అతని నేరపూరిత ప్రవర్తన క్రమబద్ధంగా, విపరీతంగా సాగిందని మండిపడ్డారు. బాధితుల లోదుస్తులతో ఉన్నప్పుడు రహస్యంగా చిత్రాలు తీశాడని, కొందరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2022 జూలైలో అరెస్ట్ అయ్యే సమయానికి అతని ప్రవర్తన సాగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

రస్తోగి చర్యల వల్ల బాధితులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఒక మహిళ తన హనీమూన్ సమయంలో ఈ దాడి జరిగిందని, ఆ తీపి జ్ఞాపకం కాస్తా బాధాకరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన వల్ల తాము పురుష ఆరోగ్య నిపుణులను నమ్మలేకపోతున్నామని బాధితులు కోర్టుకు తెలిపారు. రస్తోగికి ‘వాయూరిస్టిక్ డిజార్డర్’ (అర్ధనగ్న మహిళలను చూసి లైంగిక ఉద్రేకం పొందడం) ఉన్నట్లు మానసిక వైద్యుడు నిర్ధారించినప్పటికీ, అది అతడిని బాధ్యత నుండి విముక్తి చేయలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రస్తోగి క్షమాపణలు చెప్పినప్పటికీ, బాధితులు అతని పశ్చాత్తాపాన్ని మన్నించలేదు.

కోర్టు రస్తోగికి విధించిన శిక్షలో 10 సంవత్సరాల 10 నెలల పాటు పెరోల్ లేకుండా జీవించాల్సి ఉంటుంది. 2022 జూలై అరెస్టు తేదీ నుండి శిక్ష అమలులోకి రావడంతో, అతను 2035లో పెరోల్‌కు అర్హత పొందుతాడు. శిక్షా కాలం పూర్తయిన తర్వాత రస్తోగిని ఆస్ట్రేలియా నుండి బహిష్కరించే అవకాశం కూడా ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us