రోజుకు ఎన్ని పల్లీలు తినాలి? ఎక్కువ తింటో ఏమవుతుందో తెలుసుకోండి..
Krishna
29 June 2026
పల్లీలను సరైన మోతాదులో తినడం వల్ల శరీరానికి కావలసిన మేలైన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా శరీర కండరాల పుష్టికి, తక్షణ శక్తికి అవసరమయ్యే అధిక ప్రోటీన్ పొందడానికి ఇది ఒక చౌకైన, గొప్ప మార్గం.
ప్రోటీన్
పల్లీలలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయే హానికరమైన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి.
గుండెకు రక్షణ
శరీరానికి నిరంతర శక్తినివ్వడంతో పాటు.. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడానికి పల్లీలు తోడ్పడతాయి. అంతేకాదు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని అరికట్టే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
చర్మ కాంతి
ఆరోగ్యంగా ఉన్న ఒక సాధారణ వ్యక్తి రోజుకు కేవలం ఒక గుప్పెడు అంటే.. సుమారు 28 నుండి 30 గ్రాముల పల్లీలు మాత్రమే తినవచ్చు. సంఖ్యాపరంగా అయితే రోజుకు దాదాపు 16 నుండి 20 పల్లీలు మాత్రమే తీసుకోవడం మంచిది.
రోజుకు ఎంత తినాలి
పల్లీలలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు లేదా డైట్‌లో ఉన్నవారు వీటిని ఎక్కువగా తింటే రివర్స్ అవుతుంది. అతిగా తినడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోయి బరువు పెరుగుతారు.
బరువు పెరగడం
రుచిగా ఉన్నాయి కదా అని మోతాదు మించి పల్లీలను తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల కొంతమందిలో విపరీతమైన గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.
పొట్ట ఉబ్బరం
ఈ వేరుశెనగలను పచ్చిగా తినడం కంటే.. కాస్త వేయించి లేదా నానబెట్టి తినడం వల్ల జీర్ణం సులువుగా అవుతుంది. అలాగే మార్కెట్లో దొరికే సాల్టెడ్ లేదా మసాలా వేరుశెనగలకు దూరంగా ఉండటం గుండెకు మంచిది.
ఈ తప్పులు చేయొద్దు
ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఎవరికైనా పొట్ట సమస్యలులేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే పల్లీలను డైట్‌లో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.