AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..

సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..

Phani CH
|

Updated on: Jun 28, 2026 | 6:14 PM

Share

ఖమ్మం జిల్లా వైరా మండలం సమీపంలో మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో మహిళల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఉచిత బస్సు ప్రయాణ పథకం నేపథ్యంలో పెరిగిన రద్దీ కారణంగా ఈ వివాదం తలెత్తింది. మహిళలు ఒకరిపై ఒకరు తోపులాటకు దిగగా, బస్సు సిబ్బంది, తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం రోజురోజుకూ సరికొత్త వివాదాలకు దారితీస్తోంది. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర స్థాయిలో ఘర్షణలకు దిగుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామ సమీపంలో మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. మధిర బస్టాండ్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ గొడవ జరిగింది. బస్సులో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో పాలడుగు గ్రామ సమీపంలో బస్సు ఎక్కిన ఒక కుటుంబానికి చెందిన వ్యక్తికి సీటు ఇవ్వలేదనే కారణంతో ఓ మహిళకు, బస్సులో ఉన్న మరికొందరు మహిళలకు మధ్య వివాదం మొదలైంది. నాదంటే నాది అంటూ ఇరువర్గాలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. మాట మాట పెరిగి ఘర్షణ కాస్తా ముదిరింది. మహిళలు ఒకరినొకరు నెట్టుకుంటూ, తోపులాటకు దిగడంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు వారిని ఆపే ప్రయత్నం చేసినా వారు పట్టించుకోలేదు. చివరకు ఆర్టీసీ బస్సు సిబ్బంది, తోటి ప్రయాణికులు గట్టిగా జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ గొడవ కారణంగా బస్సు ప్రయాణానికి కాసేపు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!

క్రెడిట్ కార్డు, డిజిటల్ మోసాలకు చెక్.. ఆర్‌బీఐ సంచలన నిబంధనలు!

టిఫిన్‌ సెంటర్‌లో వేడి వేడిగా వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి!

మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఇదో వెరైటీ నిరసన!

WhatsApp: వాట్సప్‌లో పెయిడ్‌ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్‌

Follow Us