AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఇదో వెరైటీ నిరసన!

మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఇదో వెరైటీ నిరసన!

Phani CH
|

Updated on: Jun 28, 2026 | 5:51 PM

Share

ఆగ్రాలో డ్రైనేజీ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీ కార్పొరేటర్ కిషన్ నాయక్ వినూత్నంగా స్పందించారు. మోకాళ్ల లోతు మురుగు నీటిలో నిలబడి కేక్ కట్ చేస్తూ తన పుట్టినరోజును జరుపుకున్నారు. స్థానిక ప్రజల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా చేశానని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా నాయకుల పుట్టినరోజు వేడుకలు అంటే భారీ ఫ్లెక్సీలు, కేక్‌లు, అనుచరుల హంగామాతో అట్టహాసంగా జరుగుతాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మాత్రం ఒక అధికార పార్టీ కార్పొరేటర్ తన బర్త్‌డేను ఎవ్వరూ ఊహించని విధంగా జరుపుకున్నారు. ఏకంగా మోకాళ్ల లోతు మురుగు నీరున్న డ్రైనేజీ కాల్వలో నిలబడి కేక్ కట్ చేసి వినూత్న నిరసన చేపట్టారు. ఆగ్రాకు చెందిన బీజేపీ కార్పొరేటర్ కిషన్ నాయక్ తన వార్డులో నెలల తరబడి డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని మండిపడ్డారు. మురుగు నీరు రోడ్లపైకి చేరడంతో స్థానికులు నరకం చూస్తున్నారని, దీనిపై ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అధికారుల మొద్దు నిద్ర వదిలించడానికి, తన వార్డు ప్రజలను కూడా తనతో పాటు ఆ మురుగు నీటిలోకి దింపి ఈ బర్త్‌డే నిరసన ప్లాన్ చేశారు. మురుగు నీటిలోనే ఒక చిన్న టేబుల్ వేసి, దానిపై కేక్ పెట్టి కట్ చేశారు. ప్రజలు పడుతున్న నరకాన్ని పాలకులకు కళ్లకు కట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిషన్ నాయక్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు కార్పొరేటర్ భలే ఐడియా వేశారు” అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి ఈ వీడియో చూసైనా అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

WhatsApp: వాట్సప్‌లో పెయిడ్‌ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్‌

Follow Us