AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సప్‌లో పెయిడ్‌ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్‌

WhatsApp: వాట్సప్‌లో పెయిడ్‌ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్‌

Phani CH
|

Updated on: Jun 28, 2026 | 5:48 PM

Share

వాట్సప్ వినియోగదారుల కోసం మెటా ‘వాట్సప్ ప్లస్’ పేరుతో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలకు రూ.79తో ప్రత్యేక ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. 20 చాట్స్ పిన్ చేయడం, కస్టమ్ థీమ్స్, కొత్త రంగులు, ప్రీమియం స్టిక్కర్లు, రింగ్‌టోన్లు వంటి అదనపు సదుపాయాలు ఇందులో లభిస్తాయి. మొదటి నెలను ఉచితంగా ట్రయల్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం మెటా సంస్థ ‘వాట్సప్‌ ప్లస్‌’ పేరిట సరికొత్త పెయిడ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. నెలకు కేవలం రూ.79 చెల్లించడం ద్వారా ఈ ప్రీమియం సేవలను పొందవచ్చు. అయితే వినియోగదారులు దీనిని మొదట నెల రోజుల పాటు ఉచితంగా పరీక్షించుకునే అవకాశాన్ని కూడా మెటా కల్పించింది. ఈ పెయిడ్ సర్వీస్ కోసం యూజర్లు తమ వాట్సప్ యాప్ ‘సెటింగ్స్‌’లోకి వెళ్లి ‘సబ్‌స్క్రిప్షన్స్‌’ విభాగాన్ని ఎంచుకోవాలి. అక్కడ కనిపించే ‘వాట్సప్‌ ప్లస్‌’ ఆప్షన్ కింద ‘అప్‌గ్రేడ్ యువర్‌ మెసేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌’పై క్లిక్‌ చేసి ఈ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు. నచ్చని పక్షంలో ఎప్పుడైనా దీనిని రద్దు చేసుకునే వీలు కూడా కల్పించారు. ఇక ‘వాట్సప్ ప్లస్’ అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే… సాధారణ వాట్సప్‌లో కేవలం 3 చాట్‌లు మాత్రమే పిన్ చేసుకునే వీలుంటుందికదా..కానీ వాట్పస్‌ ప్లస్‌లో ఏకంగా 20 ముఖ్యమైన చాట్స్‌ను పిన్‌ చేసుకొని టాప్‌లో ఉంచుకోవచ్చు. అంతేకాదు, వాట్సప్ హోమ్ స్క్రీన్‌పై ఉండే ఐకానిక్ గ్రీన్ కలర్ లోగోను మనకు నచ్చిన రంగులోకి మార్చుకోవచ్చు. రాయల్ పర్పుల్, వెల్వెట్ రెడ్, సైబర్ పంక్ బ్లూ వంటి కలర్స్‌తో చాట్ బబుల్స్, మెసేజ్ టిక్స్, వాల్‌పేపర్స్ మార్చుకునే వీలుంది. నచ్చిన చాట్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడంతో పాటు, ప్రత్యేకమైన యానిమేటెడ్ స్టిక్కర్లు, ప్రీమియం రింగ్‌టోన్‌లను సెట్ చేసుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, పిడుగులు

Rashmika Mandanna: ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్

రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు!

అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పు!

Follow Us