గుడ్‌న్యూస్.. పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!
పోస్టాఫీస్ ఖాతాదారులకు భారత తపాలా శాఖ శుభవార్త చెప్పింది. ఆధార్ ఈ-కేవైసీ, బయోమెట్రిక్ ధృవీకరణతో రూ.50 వేల వరకు డిపాజిట్, రూ.20 వేల వరకు విత్‌డ్రా చేసేందుకు పేపర్ స్లిప్ అవసరం లేకుండా కొత్త సదుపాయాన్ని అమల్లోకి తెచ్చింది. జూన్ 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రస్తుతం సింగిల్ అకౌంట్లకు మాత్రమే వర్తించనుండగా, మొబైల్ నంబర్ లింక్ తప్పనిసరి.
పోస్టాఫీసు ఖాతాదారులకు భారత తపాలా శాఖ పెద్ద ఉపశమనం కలిగించింది. ఇకపై చిన్న మొత్తాల లావాదేవీల కోసం ఎలాంటి పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ ఈ-కేవైసీ , బయోమెట్రిక్ విధానం ద్వారా సులభంగా నగదు డిపాజిట్, విత్‌డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జూన్ 22 నుంచే ఈ సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన, ఆర్‌డీ , సేవింగ్స్ ఖాతాదారులు ఎలాంటి ‘పే-ఇన్ స్లిప్’ లేకుండా కేవలం బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా రూ.50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. అలాగే, ఎలాంటి ‘విత్‌డ్రాయల్ స్లిప్’ లేకుండా రూ.20,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ పరిమితి దాటితే మాత్రం తప్పనిసరిగా పాత పద్ధతిలోనే పేపర్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సరికొత్త సదుపాయం కేవలం సింగిల్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మైనర్ లేదా జాయింట్ అకౌంట్లకు ఇది వర్తించదు. ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న వారు త్వరలోనే దేశంలోని ఏ పోస్టాఫీస్ బ్రాంచ్ నుంచైనా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆధార్ లింక్ లేని వారు మాత్రం హోమ్ బ్రాంచ్‌కే వెళ్లాలి. బయోమెట్రిక్ లావాదేవీలకు మొబైల్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరి. 2026 సెప్టెంబర్ 1 నుంచి DREAM యాప్ ద్వారా జరిగే లావాదేవీలకు మొబైల్ నంబర్ అనుసంధానం లేకపోతే అనుమతించరు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రెడిట్ కార్డు, డిజిటల్ మోసాలకు చెక్.. ఆర్‌బీఐ సంచలన నిబంధనలు!
టిఫిన్ సెంటర్‌లో వేడి వేడిగా వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి!
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఇదో వెరైటీ నిరసన!
WhatsApp: వాట్సప్‌లో పెయిడ్ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

