AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Short Videos: షార్ట్ వీడియోస్‌తో.. పిల్లల్లో బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే ఫ్యూచర్ నాశనమే!

ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియాలోనే మునిగిపోతున్నారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా వాటితోనే గడుపుతున్నారు. అయితే జస్ట్ టైం పాస్‌ కోసమో, లేదా వినోదం కోసమో అని మనం చూస్టే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ షార్ట్‌ వీడియో మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయాని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకూ ఆ అధ్యయనాల్లో ఏం బయటపడిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Short Videos: షార్ట్ వీడియోస్‌తో.. పిల్లల్లో బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే ఫ్యూచర్ నాశనమే!
Short Video Effects
Anand T
|

Updated on: Jun 29, 2026 | 5:10 PM

Share

ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కవగా ఫోన్‌లకు అడెక్ట్ అవుతున్నారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా వాటితోనే గడుపుతున్నారు. ఈ అలవాట్లపై జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ బైరాయిత్ పరిశోధకులు చేసిన ఒక తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. టీనేజర్లు, యువత కంటిన్యూస్‌గా ఈ షార్ట్ వీడియో క్లిప్‌లు చూడటం వల్ల వారిలో ఏకాగ్రత లోపించి, ఒత్తిడి స్థాయిలు పెరిగే అవకాశం ఉందని తేలింది. యూరోపియన్ చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రీ’ జర్నల్‌లో జూన్ నెలలో ప్రచురితమైన ఈ అధ్యయనంలో షార్ట్‌ వీడియో వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో క్లియర్‌గా చెప్పుకొచ్చింది.

ఈ పరిశోధన ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌పామ్‌లు వాడేందుకు ఏజ్ లిమిట్ ఉన్నప్పటికీ.. 2023లో టిక్‌టాక్ యూజర్స్‌లో సుమారు 25శాతం కంటే ఎక్కవ మంది 13 నుంచి 17 ఏళ్లలోపు పిల్లనే ఉన్నట్టు తేలింది. ఇలా 2015 నుంచి 25 వరకు జరిగిన మొత్తం 40 అధ్యయనాలకు సంబంధించిన డేటాను పరిశీలిస్తే.. ఇందులో 17 ఏళ్లలోపు పిల్లలే 47,000లకు పైగా ఉన్నట్టు తేలింది.

అయితే ఈ షార్ట్ వీడియోల ఎక్కవగా చూడడం వల్ల పిల్లలపై బ్రెయిన్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంతో తెలసుకోవడానికి.. కొందరి EEG, MRI స్కాన్‌ల ద్వారా మెదడు పనితీరును పరీక్షించారు. ఇందులో యూత్ అసలు ఈ షార్ట్ వీడియోలకు ఇంతలా అడెక్ట్ అవ్వడానికి 3 ప్రధాన కారణాలను గుర్తించారు.

స్పీడ్ కంటెంట్ డెలివరీ: షార్ట్ వీడియోలో దాదాపు 30 సెకన్ల నుంచి 1 నిమిషం మధ్యలోనే ఉంటుంది. దీని వల్ల కంటెంట్ క్షణాల్లో మారిపోతుంది. ఇది భవిష్యత్తులో జ్ఞాపకశక్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

ఎండ్‌లెస్ స్క్రోలింగ్: ఆ షార్ట్ వీడియోస్ చూస్తున్నంత సేపు చాలా మంది అసలు టైమే తెలియదు.. అలానే స్క్రోల్ చేస్తూ ఉండిపోతారు. ఇలా చేయడం వల్ల మధ్యలో తీసుకునే సహజమైన విరామాలు తగ్గిపోతాయి.

పర్సనలైజ్డ్ అల్గారిథమ్స్: మనం ఎలాంటి వీడియోస్‌కు అట్రాక్ట్ అవుతున్నాయో.. అనేది అనలైజ్ చేసి అలాంటి మరిన్ని వీడియోను రెకమెండ్ చేయడం ద్వారా మనం చాలా టైం దానిలోనే గడిపి దానికి భానిసలయ్యే అవకాశం ఉంది.

ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఈ షార్ట్ వీడియోలను ఎక్కువగా చూడడం వల్ల ఏకాగ్రత లోపించడం, తొందరపాటుతనం జ్ఞాపకశక్తి తగ్గడం, ఆందోళన , డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని తాజాగా అధ్యనంలో తేలింది. అలాగే దీనికి బానిసయ్యే ప్రవర్తన కూడా గణనీయంగా పెరిగింది.

ఈ టైమింగ్ తగ్గించకపోతే డేంజరే

రోజుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గంటలు షార్ట్ వీడియోలు చూడటాన్ని ఈ అధ్యయనం మితిమీరిన వినియోగం గా పేర్కొంది. ఒక టైమ్ అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు.. ఈ షార్ట్ వీడియోస్‌ను చూడడాన్ని నియంత్రణ లేని వినియోగమని స్పష్టం చేసింది. కాబట్టి మీరు దీని భారీ నుంచి బయటపడాలంటే.. వాటికంటూ ఒక టైమ్ షెల్యూడ్ పెట్టుకోవడం ఉత్తమని చెబుతున్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us