AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అమ్మడు గుర్తుందా.!! 50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా నటించింది.. కట్ చేస్తే అన్ని వదిలేసి ఇప్పుడు ఇలా..

ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ అందాల తార. ఆమె పేరు రచన బెనర్జీ. తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, ఒరియా, బెంగాలీలో కూడా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. అలాగే హిందీలో కూడా సినిమాలు చేసింది. స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కించిన నేను ప్రేమిస్తున్నాను సినిమాతో పరిచయం అయ్యింది. 

ఈ అమ్మడు గుర్తుందా.!! 50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా నటించింది.. కట్ చేస్తే అన్ని వదిలేసి ఇప్పుడు ఇలా..
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2026 | 4:29 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అయ్యారు. వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. తన నటనతో అందంతో అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత ఈ చిన్నది సినిమాలకు దూరం అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు అందం అభినయంతో ఆకట్టుకున్న వారిలో రచనా బెనర్జీ ఒకరు. ఈ అందాల భామ ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కోల్‌కతాకు చెందిన రచన 1991లో మిస్‌ కోల్‌కతా కిరీటాన్ని అందుకుంది. 1992 మిస్‌ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది ఈ చిన్నది. అప్పట్లో ఆమెను మిస్‌ బ్యూటిఫుల్‌ స్మైల్‌ అని పిలిచేవారు. అందాల కిరీటం అందుకున్న ఆమె చిత్ర పరిశ్రమనూ ఆకర్షించింది. అలా 1993లో దాన్‌ ప్రతిదాన్‌ అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేసింది.

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

తమిళ్‌, కన్నడ, హిందీ, ఒడియా సినిమాల్లోనూ విభిన్న పాత్రలు పోషించారు. 1997లో నేను ప్రేమిస్తున్నాను మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. రెండో సినిమా ‘కన్యాదానం’తో మంచి గుర్తింపు పొందారు. 1998లో ఆ మూవీతో పాటు రచన నటించిన మరో నాలుగు సినిమాలు విడుదలయ్యాయంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. తెలుగులో రచన చివరిగా 2002లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించారు. టాలీవుడ్‌కు దూరమైనప్పటికీ ఇతర భాషల్లో కొన్ని సినిమాలలో నటించారు రచన.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

బెంగాలీ టీవీ రియాల్టీ షో ‘దీదీ నం.1’ వ్యాఖ్యాతగా సత్తా చాటింది. అటు నటిగా, ఇటు యాంకర్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రచన 2024లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుంది. ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా హుగ్లీ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన ఆమె.. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి లాకెట్‌ ఛటర్జీపై 76,853 ఓట్ల మెజార్టీ సాధించి. తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఒరియా సినిమా అగ్ర నటుడు సిద్ధాంత్ మహాపాత్రను పెళ్ళి చేసుకున్నది. కానీ వీరి వివాహం ఎంతో కాలం నిలువలేదు. 2004 లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. 1995 నుండి 2002 వరకు రచనా బెనర్జీ ఒరియాలో యాభైకి పైగా సినిమాలలో నటించింది. అందులో నలభైకి పైగా సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించినవే. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. రచన 2005లో ప్రొబల్ ని రెండవ వివాహం చేసుకుంది.

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us