AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: తండ్రి ప్రేమ ముందు ప్రళయమైన బలాదూర్.. కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించి ఏం చేశాడో చూడండి..

ప్రకృతి సృష్టించిన ప్రళయం ఒకవైపు.. కొడుకు చదువు కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కన్నతండ్రి సంకల్పం మరోవైపు.. నేపాల్ సరిహద్దుల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు బీహార్‌లోని ఒక మారుమూల ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. క్షణక్షణానికి పెరుగుతున్న నీటి మట్టం కళ్లముందు మృత్యువులా కనిపిస్తున్నా ఆ తండ్రి భయపడలేదు. ఆ పసివాడిని భుజాలపై మోస్తూ.. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటాడు.

Video: తండ్రి ప్రేమ ముందు ప్రళయమైన బలాదూర్.. కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించి ఏం చేశాడో చూడండి..
Bihar Man Crosses Raging River With Son On Shoulders
Krishna S
|

Updated on: Jul 16, 2026 | 5:56 PM

Share

చదువుకోవాలనే ఆ పిల్లవాడి కోరిక ముందు, కొడుకును గొప్ప ప్రయోజకుడిని చేయాలనే ఆ తండ్రి సంకల్పం ముందు ప్రకృతి సృష్టించిన బీభత్సం కూడా చిన్నబోయింది. కానీ ఆ తండ్రి చేసిన ప్రయాణం చూస్తే మాత్రం ఎవరైన షాక్ అవడం ఖాయం. ఉధృతంగా ప్రవహిస్తున్న నది, క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టం.. వీటన్నింటినీ దాటుకుంటూ ఒక తండ్రి తన ప్రాణాల కంటే ఎక్కువైన కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకుని నది దాటిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా, నేటికీ ఒక చిన్నారి బడికి వెళ్లడానికి ఇంతటి సాహసం చేయాలా? అంటూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.

ఉగ్రరూపం దాల్చిన నది.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా ప్రాంతంలోని డోన్ రీజియన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం చుట్టూ దాదాపు 22 చిన్న, పెద్ద నదులు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. రోడ్లు, విద్యుత్, వైద్యం, కనీసం దాటడానికి ఒక వంతెన వంటి కనీస మౌలిక సదుపాయాలు ఇక్కడ శూన్యం అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో నది ప్రవాహం ఎంత వేగంగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రి తన బిడ్డను భుజాలపై వేసుకుని నీటిలో నెమ్మదిగా ముందుకు సాగుతుండగా, ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కొందరు నీటిలోకి దిగి వారికి ఆసరాగా నిలిచారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడినా, లేదా పిల్లలు బడికి వెళ్లాలన్నా ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ చావుతో పోరాడాల్సిందే.

విధి ఓడినా.. తండ్రి ప్రేమ గెలిచింది..

వరద భీభత్సాన్ని చూసి ఆ తండ్రి వెనకడుగు వేయలేదు. తన కొడుకు బాగా చదువుకుని, సమాజంలో మంచి స్థాయికి చేరాలనేదే ఆ తండ్రి ఆశయం. అందుకే మృత్యువు కళ్లముందు కనిపిస్తున్నా కొడుకు భవిష్యత్తు కోసం ఆ ప్రమాదకర నదిని దాటాడు. ‘‘ప్రభుత్వం గనుక ఇక్కడ సకాలంలో ఒక శాశ్వత వంతెన నిర్మించి ఉంటే, ఈ రోజు ఒక అమాయక బాలుడు, అతని తండ్రి బడికి వెళ్లడం కోసం ఇలా ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు’’ అని స్థానిక గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తండ్రి ప్రేమానురాగాలకు సలాం కొడుతూనే, స్థానిక యంత్రాంగం, ప్రభుత్వాల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!
ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!
ఎరక్కపోయి.. గ్రిల్స్‌లో ఇరుక్కున్న దొంగ..!
ఎరక్కపోయి.. గ్రిల్స్‌లో ఇరుక్కున్న దొంగ..!
చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే..
చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే..
ఇంట్లో ఈ చిత్రాలు పెడితే డబ్బు, అదృష్టం పెరుగుతాయట.. ఏ దిశలో పెట్
ఇంట్లో ఈ చిత్రాలు పెడితే డబ్బు, అదృష్టం పెరుగుతాయట.. ఏ దిశలో పెట్
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి
పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి
పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి
ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!
ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!
ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్
ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్
బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?
బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?
ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ
ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ