AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 4th T20I: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11 నుంచి వైభవ్ ఔట్..!

New Zealand vs India, 4th T20I: భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ నేడు ఆక్లాండ్‌లో మొదలైంది. టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. రెండు కీలక మార్పులతో భారత జట్టు బరిలోకి దిగింది. ఇసాన్, మయాంక్ రీఎంట్రీ ఇవ్వగా.. వైభవ్, భువీలను తప్పించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా ఇప్పటికే 3-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్నందున, ఈ మ్యాచ్‌కు ముందు భారత్ గెలుస్తుందా లేదా అనే చర్చ లేదు.

IND vs NZ 4th T20I: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11 నుంచి వైభవ్ ఔట్..!
Ind Vs Nz Playing 11 Toss Update
Venkata Chari
|

Updated on: Oct 30, 2026 | 12:10 PM

Share

New Zealand vs India, 4th T20I: భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ నేడు ఆక్లాండ్‌లో మొదలైంది. టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. రెండు కీలక మార్పులతో భారత జట్టు బరిలోకి దిగింది. ఇసాన్, మయాంక్ రీఎంట్రీ ఇవ్వగా.. వైభవ్, భువీలను తప్పించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా ఇప్పటికే 3-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్నందున, ఈ మ్యాచ్‌కు ముందు భారత్ గెలుస్తుందా లేదా అనే చర్చ లేదు.

ఇరు జట్లు:

న్యూజిలాండ్ (ఆడే జట్టు): ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్.

తొలి టీ20ఐలో ఇషాన్ గజ్జల్లో గాయానికి గురయ్యాడు. తదనంతరం సూర్యవంశీకి రెండో, మూడో టీ20ఐలలో అవకాశం లభించింది. గత మ్యాచ్‌లో వైభవ్ 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అతను అభిషేక్‌తో కలిసి తొలి వికెట్‌కు అత్యంత వేగవంతమైన సెంచరీ భాగస్వామ్యానికి ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పాడు.

Follow Us