ప్రేమ పేరుతో మోసం చేసి.. వాడుకొని వదిలేశాడు.. బిగ్ బాస్ బ్యూటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
16 July 2026
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఇనయా సుల్తానా. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఒడిదుడుకులు చెప్పుకొచ్చింది.
ప్రేమ వంచన, మానసిక వేదనల గురించి గతంలో ఇనయా సుల్తానా పంచుకున్న విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
బిగ్‌బాస్ తర్వాత కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడిపిన ఇనయా, ఆ హడావిడి తగ్గిన తర్వాత తీవ్రమైన ఒంటరితనానికి గురైనట్లు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
ఆ మానసిక బలహీనత సమయంలో ఆమె జీవితంలోకి "గౌతమ్" అనే వ్యక్తి ప్రవేశించాడు. తనను ప్రాణంగా ప్రేమిస్తున్నాడనే భ్రమ కలిగించి, ఆమె నమ్మకాన్ని గెలుచుకున్నాడు.
నా పేరును, డబ్బును పూర్తిగా వాడుకుని, అవసరం తీరిపోయాక నన్ను వదిలేశాడు" అంటూ ఇనయా కన్నీటి పర్యంతమైంది. ఆమె కామెంట్స్ వైరలవుతున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో శారీరకంగా కూడా అతనికి దగ్గరయ్యానని, కానీ చివరికి ఆ వ్యక్తి తనను వంచించడమే కాకుండా అనేక విధాలుగా బాధపెట్టాడని తెలిపింది.
సమాజం ముందు తననే తప్పుగా చూపించడానికి ప్రయత్నించాడని ఆవేదన వ్యక్తం చేసింది. జీవితంలో ప్రేమ దొరకలేదని అందుకే గుడ్డిగా నమ్మి మోసపోయానని తెలిపింది.
జీవితంలో ఎప్పుడూ సరైన ప్రేమ లభించకపోవడమే తన బలహీనతగా మారిందని, అందుకే గుడ్డిగా నమ్మి మోసపోయానని ఆమె అంగీకరించింది.