AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి 275కుపైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు కొడుకు హీరోగా ఎంట్రీ

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. చాలా మంది నటవారసులు కేవలం బ్యాగ్రౌండ్‌తో కాకుండా తమ టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు కూడా ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు .

తండ్రి 275కుపైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు కొడుకు హీరోగా ఎంట్రీ
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jun 27, 2026 | 8:17 AM

Share

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్ పై పి చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైయింది. ముహుర్తపు సన్నివేశానికి డైరెక్టర్ డాలీ క్లాప్ కొట్టి గౌరవ దర్శకత్వం వహించారు. గంటా రవితేజ కెమరా స్విచ్ ఆన్ చేశారు. నల్లమలుపు బుజ్జి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు. పలువురు సినీ ప్రముఖులు, చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో దివ్యాని మొండల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. S చంద్రశేఖరన్ డీవోపీ గా, బిబిన్ అశోక్ సంగీత దర్శకుడిగా, నిరంజన్ దేవరమానే ఎడిటర్ గా పని చేస్తున్నారు. జూన్ 29 నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

మూవీ లాంచింగ్ ఈవెంట్‌లో వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను 275 కు పైగా సినిమాలకు పని చేశాను. ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ, అభిమానాన్ని అందించారు. ఇప్పుడు ఈ సినిమాతో మా అబ్బాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. అదే ప్రేమ, అభిమానాన్ని తనపై కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను. దర్శకుడు వీరేష్ గారు చాలా అద్భుతమైన కాన్సెప్ట్‌ను రూపొందించారు. ఆయన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ప్రస్తుత యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే కథ ఇది. ఈ సినిమాతో మా అబ్బాయికి మంచి పేరు వస్తుందని, మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. నిర్మాత చక్రధర్ రెడ్డి గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంత మంచి కాన్సెప్ట్‌కు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. దర్శకుడు ఈ కథను ఎంతో అద్భుతంగా మలిచారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.

హీరో సుస్వర తరంగ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా దర్శకుడు, నిర్మాతతో పాటు మా టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా తొలి సినిమాకే ఇంత మంచి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నాడు. హీరోయిన్ దివ్యాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగులో ఇది నా తొలి సినిమా. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శకుడు, నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా మీ అందరి ప్రేమ, ఆదరణ ఈ సినిమాకు ఉంటుందని ఆశిస్తున్నాను అని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..