డైరెక్టర్ లవర్ చెప్పిందని నా సీన్స్ తగ్గించేశారు.. కోపంతో షూటింగ్ నుంచి వచ్చేసా: పూనమ్ కౌర్
నటి పూనమ్ కౌర్ తన సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను, ఎదురైన సవాళ్లను ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. చిన్ననాటి నుంచి లాయర్ కావాలనే బలమైన కోరిక ఉన్నట్లు ఆమె తెలిపింది. తన తల్లి పడిన కష్టాలను చూసి, కపిల్ సిబల్ లేదా రామ్ జేఠ్ మలానీ వంటి పవర్ ఫుల్ లాయర్ అవ్వాలని కలలు కన్నానని తెలిపింది.

పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది పూనమ్ కౌర్. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన సినీ జీవితానికి సంబంధించిన అనేక తెలియని కోణాలను, వ్యక్తిగత ఆకాంక్షలను పంచుకుంది పూనమ్ కౌర్. నటన రంగంలోకి అనుకోకుండా వచ్చినట్లు తెలిపిన పూనమ్, తన అసలు లక్ష్యాలు, బాలీవుడ్‌లో ఎదురైన చేదు అనుభవాలు, ప్రముఖులతో సమావేశాలు, ఒక సినిమా గురువుతో జరిగిన విచిత్ర సంభాషణ గురించి పంచుకుంది. పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిపింది. తన తల్లి పడిన కష్టాలను చూసి, కపిల్ సిబల్ లేదా రామ్ జేఠ్ మలానీ వంటి ప్రభావవంతమైన లాయర్‌గా మారాలని కలలు కన్నానని ఆమె తెలిపింది.
ఒకానొక సందర్భంలో తాను నివసిస్తున్న భవనం తన తండ్రిది అని, ఆయన మరణానంతరం తన తల్లి ఆస్తి కోసం ఏడేళ్లపాటు పోరాడారని గుర్తుచేసుకుంది. లాయర్ కావడానికి ఎన్ఐఎఫ్‌టీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ), నాల్సార్ (నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్) ప్రవేశ పరీక్షలు రాశానని, నాల్సార్‌లో అవకాశం వస్తే సినిమా వైపు వచ్చేదాన్ని కాదని ఆమె స్పష్టం చేశారు. నటనను తాను కేవలం “పార్ట్-టైమ్ జాబ్” లాగానే చూశానని చెప్పుకొచ్చింది. అలాగే పూనమ్ కౌర్ బాలీవుడ్‌లో తన మొదటి సినిమా అనుభవాన్ని పంచుకుంది. ఒక పెద్ద ఖాన్ బంధువు తీస్తున్న సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.
అయితే, షూటింగ్ సమయంలో తనకు జరిగిన అవమానాలను ఆమె చెప్పుకొచ్చింది. కావాలనే తన సన్నివేశాలను తగ్గించడం, తన మేకప్‌ను మార్చడం, ఒక ప్రత్యేక నటి (దర్శకుడి ప్రియురాలు)కి అనుకూలంగా వ్యవహరించడం వంటివి జరిగాయని ఆమె తెలిపింది. పది రోజుల షూటింగ్ ఆగిపోయిన తర్వాత, దర్శకుడి తీరును నిరసిస్తూ ఆమె ఆ సినిమా నుంచి బయటకు వచ్చేశా.. ఆ సినిమా వివేక్ అగ్నిహోత్రికి చెందినదని ఆమె తెలిపింది. ఆ సమయంలో ప్రొడ్యూసర్‌కు ఫోన్ చేసి, దర్శకుడు వారి డబ్బును వృధా చేస్తున్నారని స్పష్టంగా చెప్పినట్లు పేర్కొంది. సినిమాలతో సంబంధం లేకుండా చదువుకుని, ఐక్యరాజ్యసమితిలో పనిచేయాలనేదే తన నిజమైన ఆకాంక్ష అని పూనమ్ కౌర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. తన మేనేజర్ “నువ్వు దీనికి సరిపోవు, తిరిగి రా” అని చెప్పినప్పటికీ, తన మనసు మాత్రం చదువుపైనే ఉండేదని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




