JD Chakravarthy: ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. ఆమె కోసమే మరో హీరోయిన్ను పటాయించా.. జేడీ చక్రవర్తి..
ఒకప్పుడు తెలుగు సినీ రంగంలో హీరోగా అలరించారు జేడీ చక్రవర్తి. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించారు. ఆతర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకున్న ఆయన.. ఇప్పుడిప్పుడే పలు చిత్రాల్లో సహయ నటుడిగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ప్రముఖ నటుడు జె.డి. చక్రవర్తి గతంలో ఓ ఇంటర్వ్యూలో దిల్ సే చిత్రంలోని తన బైక్ సాంగ్ మేఘాలలో వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాలను, తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. తాను ఒక ప్రొఫెషనల్ బైకర్‌నని వెల్లడించిన జె.డి. చక్రవర్తి, తన బైకింగ్ పద్ధతిని చూసే డైరెక్టర్ వంశీ బైక్ సాంగ్ ఆలోచన చేశారని తెలిపారు. వంశీతో కలిసి రాము దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పనిచేశామని, ఇద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. “నా బైక్ నువ్వు నడిపే పద్ధతి ఐ లవ్ ఇట్ రా, సో ఐ వాంట్ టు షూట్ ఏ సాంగ్” అని వంశీ తనతో అన్నారని, దానికి తాను 24 ఫ్రేమ్స్‌లో తీస్తేనే చేస్తానని కండిషన్ పెట్టానని వివరించారు. శ్రీదేవిపై తనకున్న అభిమానాన్ని కూడా జె.డి. చక్రవర్తి పంచుకున్నారు. “శ్రీదేవి గారంటే నాకు చాలా ఇష్టం. ఆవిడని రీచ్ అవ్వడానికి, మహేశ్వరిని పటాయించడానికి మంచి ఛాన్స్ అని అది కూడా ఒక ఇంటెంట్ నాది,” అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ కామెంట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, “ఓ షిట్! ఓ మై గాడ్! డిడ్ ఐ సే దట్?” అని అన్నారు.
దిల్ సే మహేశ్వరి తొలి చిత్రమని, ఆమె జీవితంలో తొలిసారి టూ-వీలర్ ఎక్కింది కూడా ఆ పాట చిత్రీకరణ సమయంలోనే అని జె.డి. చక్రవర్తి గుర్తు చేసుకున్నారు. తన భయాన్ని వివరిస్తూ, “తనకి తెలీదు కదా. తనకి అది అలాగే నడపాలేమో అనుకుంది,” అని అన్నారు. ఇటీవల తాను ఫ్లైట్ ఎక్కినప్పుడు వచ్చిన టర్బులెన్స్‌ను ఉదాహరిస్తూ, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వ్యక్తి అది మామూలే అనుకుంటాడని, అలాగే మహేశ్వరి కూడా బైక్ ఇలా ఊగుతుందని అనుకుందని వివరించారు. సినీ ప్రమోషన్ల గురించి జె.డి. చక్రవర్తి తన ప్రత్యేకమైన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమా కంటెంట్‌ను బట్టే ప్రమోషన్ ఉండాలని, “సినిమా బావుందని మేమందరం కూడా ప్రగాఢంగా నమ్ముతున్నాం… ఆ అవుట్‌కమే ఇది,” అని చెప్పారు. కాన్ఫిడెన్స్‌కు, ఓవర్ కాన్ఫిడెన్స్‌కు మధ్య ఒక పొర తేడా ఉంటుందని, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మనం తీసింది మనకు మాత్రమే నచ్చడం అని, కాన్ఫిడెన్స్ అంటే అందరికీ నచ్చడం అని వివరించారు.
తన ప్రమోషన్ ఫిలాసఫీని వివరించడానికి, “ఒక అందమైన అమ్మాయి వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది. దాని కోసం వెయిట్ చేస్తాం. అదే పెద్ద అందంగా లేని అమ్మాయి రోజుకి ఐదు సార్లు ఫోన్ చేస్తే, దానిపై ఇష్టపడం,” అనే ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. సినిమా పోస్టర్ల విషయంలోనూ ఇదే వర్తిస్తుందని, “చిక్కడపల్లిలో ఒక పోస్టర్ వేసినా, సినిమా పోస్టర్ బావుంటే అది చూసి వెళ్తాం. మన ఇంటి దగ్గర ఐదు పోస్టర్లు వేసినా చూసి వెళ్ళం,” అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
జేడీ చక్రవర్తి, శ్రీదేవి

Jd Chakravarthy., Sridevi
