AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: అప్పట్లో ఓ ఊపు ఊపేసిన పాట.. కుర్రాళ్లు తెగ పాడుకునేవారు.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న 90’s యూత్ ఫేవరేట్ సాంగ్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో 90's కిడ్స్, యూత్ కు సంబంధించిన విషయాలు.. అప్పటి జ్ఞాపకాలు తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. అప్పట్లో యువతకు పిచ్చెక్కించిన పాటలు ఇప్పుడు మరోసారి యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఓ పాటను తెగ సెర్చ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఆ పాట కుర్రకారుకు మతిపోగొట్టేసింది. ఇంతకీ ఆ సాంగ్ గురించి అంటో తెలుసా. ?

Trending Song: అప్పట్లో ఓ ఊపు ఊపేసిన పాట.. కుర్రాళ్లు తెగ పాడుకునేవారు.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న 90's యూత్ ఫేవరేట్ సాంగ్..
Devudu Varamandisthe Song
Rajitha Chanti
|

Updated on: Jul 16, 2026 | 4:33 PM

Share

సాధారణంగా తెలుగు సినీ ప్రపంచంలో ఎన్నో ఎవర్ గ్రీన్ చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ సినిమాలు వస్తుంటే టీవీలకు అతుకకుపోతుంటారు. అలాగే తెలుగు సినీ సంగీత ప్రపంచంలో కొన్ని పాటలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి ఒక పాట ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. దశాబ్దాలు గడిచినప్పటికీ ఆ సాంగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా అప్పట్లో 90’s కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. 2001లో విడుదలైన ‘6 టీన్స్’ (6 Teens) చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అందులో ఒకటి “దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే” అనే ప్రేమ గీతం. ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీత దర్శకత్వం వహించగా, ప్రసిద్ధ బాలీవుడ్ గాయకుడు కుమార్ సాను అత్యంత మధురంగా ఆలపించారు. ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం యువతను ఎంతగానో ఆకట్టుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ పాట విజయవంతం కావడానికి సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ స్వరపరిచిన బాణీ, గాయకుడు కుమార్ సాను స్వరం ప్రధాన కారణాలు అని చెప్పాలి. కుమార్ సాను గొంతులోని ప్రత్యేకమైన బేస్. ఆర్ద్రత ఈ పాటకు సరికొత్త జీవాన్ని తెచ్చిపెట్టాయి. సుద్దాల అశోక్ తేజ రాసిన లిరిక్స్ ఎంతో లోతైన భావాన్ని కలిగి ఉన్నాయి.. “కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం… తాజ్మహల్కైనా ఉందా నీ నగవుల్లోని చందం…” అంటూ వచ్చే ఈ పదాలు ప్రేయసి అందాన్ని వర్ణించే విధానాన్ని ఎంతో గొప్పగా ప్రతిబింబిస్తాయి.

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

ఈ పాటలో హీరో రోహిత్, హీరోయిన్ రుతిక ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. జి. నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈ పాటను ఎంతో అందంగా చిత్రీకరించారు. ఈ సినిమాను చిన్న బడ్జెట్‌తో నిర్మించబడినప్పటికీ, ఈ ఒక్క పాట థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ ఈ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us