OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
ఓటీటీలో సస్సెన్స్ థ్రిల్లర్ సినిమాల హవా కొనసాగుతుంది. వారం వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవుతుండగా.. ఎక్కువగా సస్పెన్, హారర్ థ్రిల్లర్ డ్రామాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక మూవీ ఓటీటీని అల్లాడిస్తుంది. ఆ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది.

ఓటీటీ వేదికలలో సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్, హారర్ సినిమాలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక తెలుగు వెబ్ సిరీస్ సంచనలం సృష్టిస్తుంది. ఆ సిరీస్ పేరు “వదింది: ది ఫేబుల్ ఆఫ్ వెలోని”. దర్శకుడు ఆండ్రూ లూయిస్ రూపొందించిన ఈ సిరీస్ కు విక్రమ్ వేద, సుడల్ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రముఖ ద్వయం పుష్కర్ గాయత్రి నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించారు. ఇది తమిళ సిరీస్. కానీ తెలుగులోనూ అందుబాటులో ఉంది. తమిలంలో వదంది అంటే పుకారు అని అర్థం. టైటిల్ కు తగ్గట్టుగానే సమాజం ఒక అమ్మాయి మరణంపై .. ఆమె క్యారెక్టర్ పై ఎలాంటి పుకార్లు సృష్టిస్తుందనేది అర్థం. ఈ రూమర్స్ విచారణను ఎలాతప్పుదోవ పట్టిస్తాయి అనే కోణాన్ని డైరెక్టర్ ఆండ్రూ లూయిస్ అద్భుతంగా తెరకెక్కించాడు.
ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..
ఈ సినిమాలో ఎస్.జే సూర్య నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. అలాగే బాధితురాలి తల్లిగా హీరోయిన్ లైలా కనిపించింది. తల్లి పాత్రలో ఎమోషనల్ నటనతో కట్టిపడేసింది. ఈ సినిమాకు సైమన్ కె.కింగ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పాలి. ఈ సినిమా స్క్రీన్ ప్లే, సస్పెన్స్, ట్విస్టులు, ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఊహించని మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ప్రారంభం నుంచి చివరి వరకు ఈ సిరీస్ మిమ్మల్ని థ్రిల్ల్ కు గురిచేస్తాయి.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..
కథ విషయానికి వస్తే..
పొగమంచుతో కప్పబడిన కన్యాకుమారి ప్రాంతంలో ఈ కథ మొదలవుతుంది. తమతోపాటు షూటింగ్ కు వచ్చిన హీరోయిన్ మమత అదృశ్యమై ఓ అడవిలో శవంగా కనిపిస్తుంది. దీంతో చిత్రయూనిట్ అక్కడి పోలీసులను సంప్రదిస్తారు. అయితే విచారణ జరుగుతున్న సమయంలోనే మమత తాను బతికే ఉన్నానని… బెంగుళూరులో ఉన్నానని పోలీసులకు ఫోన్ చేస్తుంది. అయితే అడవిలో దొరికిన అమ్మాయి మృతదేహం ఎవరిదని విచారణ చేయగా.. లైలా కూతురు వెలోని అనే అమ్మాయిదని తెలుస్తోంది. దీంతో ఆ అమ్మాయిని ఎవరు చంపారు.. ? ఈ మిస్టరీ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎస్సై వివేక్ (ఎస్జే సూర్య)కు అప్పగిస్తారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్ది ఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..
