AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: ‘టాక్సిక్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ సినిమా టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది.

Toxic Movie: 'టాక్సిక్' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది
Toxic Movie
Basha Shek
|

Updated on: Jul 16, 2026 | 5:57 PM

Share

కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఈ సినిమా రిలీజ్ కానుండడం విశేషం. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఏకంగా ఐదు గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ యశ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, పాటలను బట్టి చూస్తే, ఈ చిత్రంలో చాలా హాట్ సీన్లు, యాక్షన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయని స్పష్టమవుతోంది. అయితే ఇందులో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉందని తెలుస్తోంది. మరి ఇందులో యశ్ చెల్లెలిగా ఎవరు నటిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కొందరేమో లేడీ సూపర్ స్టార్ నయనతార యశ్ కు సిస్టర్ గా నటిస్తుందని చెబుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే టాక్సిక్ సినిమాలో పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు నటిస్తున్నసంగతి తెలిసిందే. కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ అని ఇప్పటికే తెలిసిపోయింది. అలాగే హ్యుమా ఖురేషి, తారా సుతారియా కూడా యశ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అయితే వీరందరి కంటే ముందే ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు టాక్సిక్ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. అలా చేజేతులా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు కరీనా కపూర్.

హిందీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కరీనాకు టాక్సిక్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఏ పాత్ర అనేది తెలియదు కానీ యశ్ తో కరీనా నటిస్తుందని తెగ ప్రచారం జరిగింది. ఒక వేళ ఇదే జరిగి ఉందే కరీనాకు ఇదే మొదటి దక్షిణాది సినిమా అయ్యేది . అలాగే ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయ్యేది. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్లుండి టాక్సిక్ సినిమా నుంచి తప్పుకుంది కరీనా. ఆ తర్వాతా ఆమె ప్లేస్ లోకి లేడీ సూపర్ స్టార్ నయనతార చేరిందని తెలుస్తోంది.

ఇక టాక్సిక్ సినిమా విషయానికి వస్తే.. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ సహా పలువురు విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా సంగీతం అందిస్తున్నారు. కొన్ని పాటలకు విశాల్ కూడా సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

తబాహి  సాంగ్ లో కియారా అద్వానీ, యశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రేషన్ కార్డు ఉందా..? ప్రభుత్వం నుంచి నేరుగా అకౌంట్లోకి డబ్బులు
రేషన్ కార్డు ఉందా..? ప్రభుత్వం నుంచి నేరుగా అకౌంట్లోకి డబ్బులు
కుక్క పని గాడిద చేస్తే ఏమవుతుందో తెలుసా?.. మీ కళ్ళు తెరిపించే కథ
కుక్క పని గాడిద చేస్తే ఏమవుతుందో తెలుసా?.. మీ కళ్ళు తెరిపించే కథ
నిజం చెబుతున్నా.. అలాంటోడిని వదిలేస్తే, టీమిండియాకు దరిద్రమే..!
నిజం చెబుతున్నా.. అలాంటోడిని వదిలేస్తే, టీమిండియాకు దరిద్రమే..!
మరో క్రేజీ సినిమాను ఒకే చేసిన మాస్ రాజా..
మరో క్రేజీ సినిమాను ఒకే చేసిన మాస్ రాజా..
: విశాఖలో గుండె పగిలే విషాదం.. అర్ధరాత్రి బంధువులకు మెసేజ్..
: విశాఖలో గుండె పగిలే విషాదం.. అర్ధరాత్రి బంధువులకు మెసేజ్..
మళ్లీ పెరిగిన CNG ధరలు
మళ్లీ పెరిగిన CNG ధరలు
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్డు ఉడికించేటప్పుడు ఇది..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్డు ఉడికించేటప్పుడు ఇది..
ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలు
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..