AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా వెళ్తున్న దంపతులు.. అనుమానంతో అడ్డుకున్న స్థానికులు షాక్!

గుంటూరు జిల్లా తెనాలిలో యువకుడి హత్య తీవ్ర కలకలం రేగింది. ఒక ఇంటి నుండే అదే పనిగా అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. నైట్ రౌండ్ లో ఉన్న కానిస్టేబుల్ ఇంటి వద్దకు వచ్చి తలుపు కొట్టిన ఎవరూ తలుపు తీయలేదు. కొద్దిసేపు వేచి చూసిన కానిస్టేబుల్ లోపల నుండి ఎటువంటి అలికిడి లేకపోవడంతో అక్కడ నుండి వెళ్లిపోయాడు.

Guntur: ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా వెళ్తున్న దంపతులు.. అనుమానంతో అడ్డుకున్న స్థానికులు షాక్!
Auto Ricksha Representee Image
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 16, 2026 | 5:48 PM

Share

గుంటూరు జిల్లా తెనాలిలో యువకుడి హత్య తీవ్ర కలకలం రేగింది. ఒక ఇంటి నుండే అదే పనిగా అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. నైట్ రౌండ్ లో ఉన్న కానిస్టేబుల్ ఇంటి వద్దకు వచ్చి తలుపు కొట్టిన ఎవరూ తలుపు తీయలేదు. కొద్దిసేపు వేచి చూసిన కానిస్టేబుల్ లోపల నుండి ఎటువంటి అలికిడి లేకపోవడంతో అక్కడ నుండి వెళ్లిపోయాడు. అయితే తెల్లవారు జామున ఆటోలో ఏదో తరలించేందుకు ఆ కుటుంబం ప్రయత్నాలు చేస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి అడ్డగించారు. ఆటోలో శవం కనిపించడంతో అవాక్కైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం బయటపడింది.

నాజరు పేటలో నివాసం ఉండే భాస్కరరావు, విజయమ్మలకు ఇద్దరూ సంతానం. పెద్ద కొడుకు కోటేశ్వరరావు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లైన కోటేశ్వరరావు భార్యతో విభేదాల కారణంగా తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. చిన్న కొడుకు మరియదాసు ఆర్టీసీలో హైర్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయతే ఈ దంపతులుకు రెండు సెంట్ల భూమి ఉంది. ఈ భూమి వివాదంలో తరుచు గొడవలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వచ్చే కోటేశ్వరరావు ఆ భూమిని అమ్మి డబ్బులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులతో ఘర్షన పడుతుండేవాడు. అయితే ఆ భూమి అమ్మేందుకు తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు. కోటేశ్వరరావు ప్రతి రోజూ ఘర్షణకు దిగుతుండటంతో తమ్ముడు మరియదాసు ఇంటి రావడం కూడా తగ్గించేశాడు. ఈ క్రమంలోనే బుధవారం (జూలై 15) ఉదయం నుండి ఇంట్లో మరోసారి పెద్ద పెద్దగా కేకలు వినిపించాయి. కోటేశ్వరరావు ఘర్షణ పడుతున్నట్లు స్థానికులకు అర్దమైంది. ఘర్షణ వద్దని స్థానికులు వారికి నచ్చజెప్పారు.

అయితే రాత్రి మద్యం సేవించి వచ్చిన కోటేశ్వరరావు మరోసారి తల్లిదండ్రులతో ఘర్షణ పడ్డాడు. మరియదాసు కూడా అదే సమయంలో ఇంట్లో ఉన్నాడు. దీంతో ముగ్గురు కలిసి కోటేశ్వరరావు గొంతుకోసి హత్య చేశారు. తెల్లవారుజామున గట్టుచప్పుడు కాకుండా మ్రుతదేహాన్ని తరలించే ప్రయత్నం చేశారు. రాత్రి పెద్ద పెద్ద కేకలు వినిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆటోను అడ్డుకున్నారు. ఆటోలో కోటేశ్వరరావు మ్రుతదేహం ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లిద్రండులే హత్య చేసినట్లు భావించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!