AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పార్ట్‌నర్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేయండి.. లైట్ తీసుకుంటే కొంప కొల్లేరే..

పొద్దున లేచింది మొదలు కాల్స్, బ్యాంకింగ్, షాపింగ్, ఫోటోలు.. ఒకటేమిటి సమస్తం ఫోన్ల తోనే. అయితే మనకు తెలియకుండానే మన జేబులో ఉన్న ఫోన్ మన వ్యక్తిగత జీవితానికి పెద్ద శత్రువుగా మారుతుందా? మన ప్రైవేట్ విషయాలన్నీ లీక్ అయిపోతున్నాయా? అంటే.. అవుననే అంటున్నారు టెక్ నిపుణులు. ముఖ్యంగా మీ భాగస్వామితో ఏకాంతంగా ఉన్న సమయంలో కొన్ని ఫోన్ సెట్టింగ్‌లు ఆన్ ఉంటే.. మీ ప్రైవసీ పూర్తిగా ప్రమాదంలో పడినట్లే.. మరి ఆ డేంజర్ సెట్టింగ్స్ ఎలా ఆఫ్ చేసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Krishna S
|

Updated on: Jul 16, 2026 | 4:04 PM

Share
మీ మాటలు వినేస్తున్న వాయిస్ అసిస్టెంట్స్: మనం ఫోన్‌తో పనిలేకుండా హే గూగుల్, సిరి అనో పిలవగానే పలుకుతాయి కదా? అలా పలకడానికి అవి 24 గంటలూ బ్యాక్‌గ్రౌండ్‌లో మీ మైక్రోఫోన్‌ను యాక్టివ్‌గా ఉంచుతాయి. అంటే మీరు పక్కన ఏం మాట్లాడుకుంటున్నా, ఏకాంతంగా ఎలాంటి ముచ్చట్లు పెడుతున్నా అది వింటూనే ఉంటుంది.. అందుకే మీకు అవసరం లేనప్పుడు ఈ వాయిస్ అసిస్టెంట్‌లను వెంటనే ఆఫ్ చేసుకోవడం మంచిది. దీనివల్ల మీ ప్రైవసీ పెరగడమే కాదు, మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా వరకు ఆదా అవుతుంది.

1 / 5
చాలా యాప్స్‌కి మైక్రోఫోన్, కెమెరా పర్మిషన్లు అసలు అవసరమే ఉండదు.. కానీ పర్మిషన్లు అడిగి మరీ యాక్సెస్ చేస్తాయి. దీనివల్ల మీరు ఫోన్ పక్కన పెట్టినా కూడా కొన్ని యాప్స్ మీపై నిఘా వేసే ప్రమాదం ఉంది. వెంటనే మీ ఫోన్ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ లేదా పర్మిషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి చెక్ చేయండి. ఏ ఏ యాప్స్ మీ కెమెరాను, మైక్‌ను వాడుతున్నాయో చూసి, అవసరం లేని థర్డ్ పార్టీ యాప్స్ పర్మిషన్లను వెంటనే డిసేబుల్ చేయండి.

2 / 5
మరోవైపు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? అనేది కూడా కొన్ని యాప్స్ నిరంతరం ట్రాక్ చేస్తుంటాయి. అందుకే లొకేషన్ సెట్టింగ్స్‌లో ఎల్లప్పుడూ అనుమతించే Always Allow ఆప్షన్ కాకుండా While using the app లేదా ప్రతిసారీ అడగండి అనే ఆప్షన్ పెట్టుకోవడం సురక్షితం. ఇది అనవసరంగా మీ లొకేషన్ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.

3 / 5
ఇక ఫోటోల విషయానికి వస్తే.. ఏదైనా ఒక ఫోటో అప్‌లోడ్ చేయడానికి కొన్ని యాప్స్ మీ మొత్తం గ్యాలరీ యాక్సెస్‌ను అడుగుతాయి. అలాంటప్పుడు మొహమాటం లేకుండా Selected Photos ఆప్షన్ ఎంచుకోండి. దీనివల్ల మీ పర్సనల్ ఫోటోలు సురక్షితంగా ఉంటాయి. అలాగే ఉపయోగంలో లేనప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ డేటాను షేర్ చేసే అనవసరమైన యాప్స్‌ను పూర్తిగా డిసేబుల్ చేయడం ముఖ్యం.

4 / 5
ఇక హోటళ్లు, రైల్వే స్టేషన్లు లేదా బహిరంగ ప్రదేశాలలో దొరికే ఉచిత వై ఫై చూసి మురిసిపోయి కనెక్ట్ అవ్వకండి. ఇలాంటి ఉచిత నెట్‌వర్క్‌ల ద్వారా మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. ఎంత అవసరమైనా మీ మొబైల్ డేటానే వాడుకోండి కానీ.. ఫ్రీ వై ఫైల జోలికి వెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్ భద్రత మీ చేతుల్లోనే ఉంది కాబట్టి వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చుకోండి.

5 / 5
Follow Us
త్వరలో మరో వందే భారత్ రైలు.. ప్రకృతి సోయగాల మధ్య జర్నీ..

మన టైమ్ వచ్చేసింది భయ్యా.. వారు అనుకున్నది సాధిస్తారు..!

గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు కేంద్రం ఆమోదం

చంద్రుడిని రాకెట్ శకలం ఢీకొట్టిన వీడియో చూశారా?

డబ్బు పోయినా పర్లేదు.. జీవితంలో ఈ కష్టాలు వస్తే మాత్రం భరించలేరట!

గంజి నీళ్లను పారబోస్తున్నారా?.. ఇది తెలిస్తే ఇకపై అలా చేయరు!

మీరు సిజేరియన్ మదరా?..బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో ఈ తప్పులు చేయకండి!

ఫోన్ వాడిన తర్వాత మహిళల్లో ఈ లక్షణాలుంటే తస్మాత్ జాగ్రత్త!

జాబ్ మార్కెట్‌లో నయా ట్రెండ్.. అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా Google

ఆధార్ కార్డులో మూడోసారి పేరు మార్చుకోవడం ఎలా..?