స్టేజ్ పై పెర్ఫార్మెన్స్‌తో సెగలు పుట్టించిన జ్యోత్స్న.. ఫోటోస్ ఇదిగో
Rajitha Chanti
Pic credit - Instagram
29 Jun 2026
బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు గాయత్రీ సింహాద్రి. 'కార్తీకదీపం 2' వంటి పాపులర్ సీరియల్స్‌లో తన నటనతో మెప్పిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
నటిగానే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన వ్యక్తిగత విషయాలను, ఫోటో షూట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ వార్తల్లో నిలుస్తుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఈమె పాల్గొన్న ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఆమె ఒక వేదికపై తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించారు.
ఆ సమయంలో తీసిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోగా, అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోస్ పై నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.
ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తూనే, స్టేజ్ మీద ఎంతో ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆమె అందరినీ ఆకట్టుకున్నారు. గాయత్రీ ఎంతో స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తున్నారు.
గాయత్రీ సింహాద్రికి సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ ఫోటో పెట్టినా, ఏ వీడియో షేర్ చేసినా నిమిషాల్లో వేల సంఖ్యలో వ్యూస్, లైక్స్ వస్తుంటాయి.
స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఫోటోలను చూసిన నెటిజన్లు, "స్టేజ్ మీద కూడా అదరగొట్టేస్తున్నారు", "చాలా అందంగా ఉన్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెగిటివ్ పాత్రలో మెప్పిస్తుంది.
మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్లతో కట్టిపడేస్తుంది. ఇప్పుడు నటనతో పాటు డ్యాన్స్‌లో కూడా తాను ఏమాత్రం తక్కువ కాదని ఈ పెర్ఫార్మెన్స్‌తో నిరూపించుకున్నారు.