బాల్యవివాహాలను అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెళ్లి శుభలేఖలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరిగా ముద్రించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఈ నిర్ణయం ద్వారా బాల్యవివాహాలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. రాజస్థాన్‌లో ఇప్పటికే విజయవంతమైన ఈ మోడల్‌ను మహారాష్ట్రలో అమలు చేయనున్నారు.