AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sacred Herb:ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో.. పౌర్ణమి రోజున దీన్ని పూజిస్తే ఏమవుతుందో తెలుసా?

ఉత్తరేణి మొక్కకు ఆయుర్వేదంలో, జ్యోతిష్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దీని వేరు, ఆకులు, కాండం, గింజలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. పౌర్ణమి రోజున ఈ మొక్కకు పూజ చేయడం వలన, దీని వేరును తాయెత్తుగా ధరించడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతుంటారు. ఈ మొక్క కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఎంతో పవర్ఫుల్ ప్రయోజనాలను కలిగిస్తుందని నమ్ముతారు.

Sacred Herb:ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో.. పౌర్ణమి రోజున దీన్ని పూజిస్తే ఏమవుతుందో తెలుసా?
Uttareni Plant Devotional Medici
Bhavani
|

Updated on: Apr 02, 2025 | 9:19 PM

Share

ఉత్తరేణి మొక్క ఆయుర్వేదంలోనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో విశిష్టమైనది. పౌర్ణమి రోజున ఈ మొక్క మూలానికి పంచోపచార పూజ చేయడం వల్ల జీవితంలోని పెద్ద సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. వినాయక చవితి పత్రిలో కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తరేణి వేరును మణికట్టు లేదా చేతిపై తాయెత్తు రూపంలో ధరిస్తే జీవితంలోని ఆటంకాలు తొలగిపోతాయి.

తెల్లటి ఉత్తరేణి మొక్క ఇంట్లో ఉంటే ఆనందం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయి. చెడు దృష్టి నుంచి రక్షణ కోసం దీని వేర్లను పూజించి కుడి చేతికి ధరించడం శ్రేయస్కరం. శుభ ముహూర్తంలో ఉత్తరేణి వేరును ఇంట్లో సురక్షితమైన స్థలంలో ఉంచితే ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఉత్తరేణి మొక్కను పూజించడం వల్ల ఆధ్యాత్మికంగాను, దీనిని ఔషధంగా ఉపయోగించడం వల్ల శారీరకంగాను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఉత్తరేణి మొక్క – ఔషధ ఉపయోగాలు:

  • ఉబ్బసం, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఉత్తరేణి ఎండిన ఆకులను కాల్చి ఆ పొగ పీల్చితే ఉపశమనం లభిస్తుంది.
  • ఉత్తరేణి ఆకుల బూడిదను ఆముదంతో కలిపి గజ్జి, తామర ఉన్న చోట రాస్తే తగ్గుతాయి.
  • ఉత్తరేణి ఆకుల రసం కడుపు నొప్పి, అజీర్ణం, మొలలు, చర్మ సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
  • ఉత్తరేణి వేరుతో పళ్ళు తోమితే చిగుళ్ళు, పళ్ళు గట్టిపడతాయి.
  • గాయాలైనప్పుడు ఉత్తరేణి ఆకుల రసం రాస్తే రక్తస్రావం తగ్గుతుంది.
  • దురద, పొక్కులు, చర్మం పొట్టు రాలడం వంటి సమస్యలకు ఉత్తరేణి రసం ఉపశమనం కలిగిస్తుంది.
  • తేలు, కందిరీగ కుట్టినప్పుడు ఉత్తరేణి ఆకులను నూరి రాస్తే నొప్పి, దురద తగ్గుతాయి.
  • ఉత్తరేణి గింజల పొడి, ఉప్పు, పటిక పొడి, కర్పూరం కలిపిన మిశ్రమం పంటి నొప్పి, చిగుళ్ళ రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.
  • ఉత్తరేణి బూడిదను తేనెతో కలిపి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు, గుండె సంబంధిత వ్యాధులు, శ్లేష్మం తగ్గుతాయి.
  • మజ్జిగతో కలిపి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి.
  • పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంథి వాపు సమస్యకు ఉత్తరేణి చూర్ణానికి ఆవునెయ్యి కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
  • ఉత్తరేణి వేర్ల చూర్ణాన్ని మిరియాల పొడితో కలిపి తీసుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి.
  • పిచ్చి కుక్క కరిచిన వారికి ఉత్తరేణి గింజల చూర్ణం దివ్య ఔషధం.
  • ఉత్తరేణి ఆకు రసంలో ముల్లంగి గింజలు కలిపి రాస్తే సోరియాసిస్ మచ్చలు తగ్గుతాయి.

ఈ విధంగా ఉత్తరేణి మొక్కను పూజించడం వల్ల ఆధ్యాత్మికంగాను, దీనిని ఔషధంగా ఉపయోగించడం వల్ల శారీరకంగాను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.