AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monday Worship: సోమవారం నాడు శివుడిని ఇలా ఆరాధిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి.. వివరాలు మీకోసం..

హిందూ మతంలో ప్రతి రోజు ఏదో ఒక దేవతకి అంకితం చేయబడింది. సోమవారాన్ని ఆదిదేవుడు శివుని రోజుగా పరిగణిస్తారు. అందుకే భక్తులు సోమవారాలు ఉపవాసం ఉండి శివుడిని మనస్ఫూర్తిగా పూజిస్తారు.

Monday Worship: సోమవారం నాడు శివుడిని ఇలా ఆరాధిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి.. వివరాలు మీకోసం..
Lord Shiva
Shiva Prajapati
|

Updated on: Feb 06, 2023 | 6:10 AM

Share

హిందూ మతంలో ప్రతి రోజు ఏదో ఒక దేవతకి అంకితం చేయబడింది. సోమవారాన్ని ఆదిదేవుడు శివుని రోజుగా పరిగణిస్తారు. అందుకే భక్తులు సోమవారాలు ఉపవాసం ఉండి శివుడిని మనస్ఫూర్తిగా పూజిస్తారు. దేవతలందరిలోనూ శివుడు చాలా అమాయక, సున్నితమైన దేవుడిగా పరిగణించబడ్డాడు. భక్తులు పిలిస్తే చాలు పరవశించిపోతారు. సోమవారం నాడు శివుడిని పూజించడం, ఆయనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యలు చాలా ప్రభావవంతంగా పరిగణించబడ్డాయి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని, భక్తులకు శివుని అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. సోమవారం ఎలాంటి చర్యలు, పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మనస్ఫూర్తిగా ఆరాధించండి..

సోమవారం రోజున పరమశివుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. శంకరుని ప్రసన్నం చేసుకోవడానికి తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూజించాలి.

ఈ వస్తువులను శివుడికి సమర్పించాలి..

సోమవారం నాడు పరమ శివుడికి అభిషేకం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివలింగంపై గంధం, అక్షత, బిల్వ పత్ర, ధాతుర, పాలు, గంగాజలం సమర్పించడం ద్వారా.. శివుడు త్వరగా ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తాడని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

ఈ వస్తువులను శివునికి నైవేద్యంగా పెట్టాలి..

నెయ్యి, పంచదార, గోధుమ పిండితో చేసిన ప్రసాదాన్ని సోమవారం నాడు పరమశివునికి నైవేద్యంగా పెట్టాలి. ధూపం, దీపాలతో పరమేశ్వరుడికి హారతి ఇవ్వాలి. అనంతరం ప్రసాదం నేవైద్యం పెట్టి, అందరికీ పంచాలి. ఇలా చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభించింది మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.

ఈ మంత్రం లాభాలను ఇస్తుంది..

సోమవారం నాడు మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా శివుని విశేష అనుగ్రహం లభిస్తుంది. శివలింగానికి పచ్చి ఆవు పాలను సమర్పించడం కూడా మంచి నివారణగా పరిగణించబడుతుంది.

అవసరమైన వారికి దానం చేయండి..

సోమవారం నాడు తలస్నానం చేసిన తర్వాత తెల్లటి రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున తెల్లని రంగు ఆహార పదార్థాలను అవసరమైన వారికి దానం చేయాలి. ఇది జాతకంలో చంద్ర గ్రహం స్థితిని బలపరుస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతిని కలిగిస్తుంది.

గమనిక: ఇందులో పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి