AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Parakamani: తిరుమల శ్రీవారి ఆలయంలో ‘పరకామణి’ చారిత్రక రహస్యం మీకు తెలుసా?

పరకామణికి శతాబ్దాల చరిత్ర ఉంది. శ్రీవారి ఆలయ చరిత్రలో పరకామణికి ఓ విశిష్ట స్థానం ఉంది. పరకామణి అంటే కేవలం నగలు, నగదు లెక్కించే ప్లేస్‌ మాత్రమే కాదు.

TTD Parakamani: తిరుమల శ్రీవారి ఆలయంలో ‘పరకామణి’ చారిత్రక రహస్యం మీకు తెలుసా?
Ttd Parakamani
Shiva Prajapati
|

Updated on: Feb 06, 2023 | 6:14 AM

Share

పరకామణికి శతాబ్దాల చరిత్ర ఉంది. శ్రీవారి ఆలయ చరిత్రలో పరకామణికి ఓ విశిష్ట స్థానం ఉంది. పరకామణి అంటే కేవలం నగలు, నగదు లెక్కించే ప్లేస్‌ మాత్రమే కాదు. అంతకుమించి అంటోంది ఆలయ చరిత్ర. అసలు ఏంటి ఈ పరకామణి? దాని ప్రాముఖ్యత ఏంటి? ఆసక్తికర వివరాలు మీకోసం..

నిత్య కల్యాణం.. పచ్చ తోరణంలా వెలిగిపోయే తిరుమల. శ్రీవారి సన్నిధి.. భక్తుల పాలిట పెన్నిధి. శ్రీవారి ఆలయానికి ఎంత చరిత్ర ఉందో పరకామణికి కూడా అంత చరిత్ర ఉంది. తరతరాల నుంచి శతాబ్దాల నుంచి శ్రీవారికి వస్తున్న నగదు, కానుకలను లెక్కించే కార్యక్రమాన్ని పరకామణి అని పిలుస్తున్నారు.

హుండీకి మరో పేరు కొప్పెర..

తిరుమల శ్రీనివాసుడి హుండీ నిత్యం కానుకలతో కళకళలాడుతుంది. శ్రీమంతుల నుంచి సామాన్యుడి దాకా తమ స్థాయిని బట్టి రకరకాల కానుకలను శ్రీవారికి భక్తులు సమర్పిస్తారు. ఈ హుండీనే కొప్పెర అని కూడా అంటారు. శ్రీనివాసుడికి ఆయన మామగారు ఆకాశరాజు నుంచి వచ్చిన కానుకల నుంచి నేటి భక్తులు సమర్పించే కానుకల దాకా అన్నీ హుండీ లోనే సమర్పిస్తారు.

ఇవి కూడా చదవండి

17వ శతాబ్దం కంటే ముందే పరకామణి..

భక్తులు తమ తమ స్థాయిని బట్టి నగలు, నగదును శ్రీవారికి హుండీ ద్వారా సమర్పిస్తారు. శ్రీవారి ఖజానాకు బంగారు వెండి కానుకలు కూడా కుప్పలుతెప్పలుగా వస్తూనే ఉన్నాయి. 17 శతాబ్దం ముందు నుంచే శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించినట్లు శ్రీవారి ఆలయ చరిత్ర చెబుతోంది. శ్వేత వస్త్రంతో కూడిన గంగాళాన్ని భక్తులు హుండీగా పిలుస్తారు. హుండీ ద్వారా స్వామివారికి రోజుకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. శ్రీవారి హుండీ ఆదాయం….ఎప్పటికప్పుడు రికార్డులను బద్దలు కొడుతోంది. బంగారం, వెండి ఆభరణాలతోపాటు స్థిరాస్తుల దస్తావేజులు, వస్త్రాలు, నిలువుదోపిడీలు, బియ్యం లాంటి వస్తువులను కూడా భక్తులు కానుకలుగా హుండీలో సమర్పిస్తారు.

రోజుకు రూ. 5 కోట్ల హుండీ ఆదాయం..

శ్రీవారి కొప్పెర లేదా హుండీగా పరిగణించే గంగాళం కానుకలతో నిండిన తర్వాత లెక్కింపు కోసం పరకామణికి చేర్చుతారు. ఈ గంగాళాలను విజిలెన్స్, ఆలయ అధికారులు, బొక్కసం సిబ్బంది సమక్షంలో తెరిచి లెక్కిస్తారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 5 కోట్ల రూపాయల దాకా హుండీ ఆదాయం సమకూరుతోంది.

1965 వరకు బంగారు వాకిలి దగ్గరే లెక్కింపు..

కట్టుదిట్టమైన నిఘా నడుమ హుండీ లెక్కింపు సాగుతుంది. చిల్లర నాణేలు, స్వదేశీ, విదేశీ నోట్లు, పురాతన నాణేలు, ఆభరణాలు, ముడుపులు, వస్తువులు, విలువైన పత్రాలు, కోర్కెల చిట్టాలు శుభలేఖలు, విజిటింగ్ కార్డులు కలకండ బియ్యం పసుపు…ఇలా రకరకాల కానుకలు హుండీకి చేరుతున్నాయి..1965 వరకు హుండీ లెక్కింపు బంగారు వాకిలి వద్దే జరిగేది. ఆ తర్వాత కానుకలు రావడం పెరగడంతో హుండీ లెక్కింపునకు ఆలయ ప్రాగణంలో ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.

12 నుంచి 14 గంగాళాల కానుకలు..

భక్తులు సమర్పించే కానుకలతో రోజూ 12 నుంచి 14 గంగాళాలు నిండుతాయి. ఈ గంగాళాలను బంగారు వాకిలి వద్దకు తరలించి ఏకాంత సమయానికి స్ట్రాంగ్ రూమ్‌కు చేరుస్తారు. పరకామణిలో 27 సీసీ కెమెరాల నిఘా నేత్రాల నడుమ కట్టుదిట్టంగా హుండీ కానుకలను లెక్కిస్తారు.

నిబంధనల నడుమ విధులు..

పరకామణి విధుల్లో ఉండే సిబ్బంది పలు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 2012 ఆగస్టు 20న పరకామణి సేవను టీటీడీ ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి రిటైర్‌ అయినవారు పరకామణిలో స్వచ్ఛంద సేవలను అందించేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. దీనికోసం ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకునే వీలుంది. భక్తుల సంఖ్యతో పాటు కానుకలు కూడా వెల్లువలా వచ్చి పడుతుండడంతో పరకామణిలో లెక్కింపునకు ఇబ్బందిగా మారింది. దీంతో కొత్త భవనాన్ని నిర్మించి పరకామణిని అందులోకి తరలించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..