ఎన్టీఆర్ జిల్లాలోని ముక్త్యాలలో కోతులు ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. సామగ్రిని ఎత్తుకెళ్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కోతులు, కుక్కల బెడదతో జనం ఇల్లు దాటడానికి భయపడుతున్నారు. ఈ ఒక్క నెలలోనే జంతువుల దాడుల్లో 206 మంది గాయపడ్డారు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.