Sunflower Seeds: పొద్దు తిరుగుడు గింజలతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా? అధిక బరువుతో పాటు ఆ రోగాలు కూడా హాంఫట్‌

పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎముకలకు మేలు చేసే మెగ్నీషియం, విటమిన్-ఇ మరియు అనేక ఇతర పోషకాలు ఈ విత్తనాలలో ఉన్నాయి.

Sunflower Seeds: పొద్దు తిరుగుడు గింజలతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా? అధిక బరువుతో పాటు ఆ రోగాలు కూడా హాంఫట్‌
Sunflower Seeds
Follow us

|

Updated on: Feb 05, 2023 | 9:43 PM

పొద్దుతిరుగుడు పువ్వు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. సూర్యరశ్మికి అనుగుణంగా తన దిశను మార్చుకునే ఈ పువ్వు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అదే సమయంలో పొద్దు తిరుగుడు గింజలు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. అవును, పొద్దుతిరుగుడు విత్తనాలు అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించే ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. ఈ గింజల్లో ప్రొటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాగా ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరిగింది. పొద్దుతిరుగుడు గింజల్లో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. మీరు ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తింటే, మీరు స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చు. పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎముకలకు మేలు చేసే మెగ్నీషియం, విటమిన్-ఇ మరియు అనేక ఇతర పోషకాలు ఈ విత్తనాలలో ఉన్నాయి. కాబట్టి ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పొద్దు తిరుగుడు గింజల్లో ఉండే పోషకాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. ఇందులోని మెగ్నీషియం మెదడుకు మేలు చేస్తుంది.

ఇక ఆర్థరైటిస్‌కు ప్రభావవంతమైనది సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ నూనెను ఉపయోగించడం వల్ల కీళ్లనొప్పుల సమస్య తగ్గుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే విటమిన్-సి, విటమిన్-ఇ, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు అధిక రక్తపోటు రోగులకు మేలు చేస్తాయి. ఇవి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పొద్దు తిరుగుడు విత్తనాల‌ను నిత్యం తీసుకోవడం వల్ల హైబీపీ కంట్రోల్ అవుతుంది. అంతేకాక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరగడంతో పాటు చ‌ర్మం, వెంట్రుక‌ల‌కు సంరక్షణ క‌లుగుతుంది. ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. హార్మోన్ల స‌మ‌స్యలు, ఆసమతుల్యత ఉన్నవారు పొద్దు తిరుగుడు గింజలు తింటే మంచిది. దీని వ‌ల్ల మ‌హిళ‌ల్లో ఈస్ట్రోజ‌న్‌, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు స‌మ‌తుల్యంలో ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా ప‌నిచేస్తుంది. గ‌ర్భవతుుల పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. వీటిని తినడం వల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..